గురు లాభాలు
గురు లాభాలు అంటే నా లాంటి గురువులకి ఉండే లాభాలు. అవి పెద్దగా ఉంటాయి.ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా మా శిష్యులు మమ్మల్ని
\From !998 to 2004 I was connected with Viswanadha Institute of Technology and Management started at Parvathipuram ,as a professor and as a helping hand for the management consisting of 3 Viswanadha Brothers.ముగ్గురు ‘సుంకి ‘బుగతలు .
నా వద్ద చదువుకున్న వారిలో కొందరు బాగు పడ్డారు కూడాను !. అందులో ఇద్దరు ,విశ్వనాధ రమేశ్.కలివరపు కృష్ణ లు.
వారిద్దరు మొదటి batch కి చెందినవారు. రమేశ్ నడిమి బుగత నాగేశ్వర రావు సుపుత్రుడు . నాగేశ్వర రావుకి కి ఉన్న సాహిత్య అభిరుచి వలన నాకు మరింత దగ్గర అయ్యారు కలివరపు వారు వారణాసి వారు పార్వతి పురం విద్యార్ధుల అవసరాలు తీర్చే వ్యాపారస్తులు
రమేశ్ కి తండ్రి చాలు వచ్చి సాహిత్యవాసన అంటి నాకు దగ్గర అయ్యాడు.
కృష్ణ డిగ్రీ పుర్తియ్యాక నాకు తోటి ఉపాధ్యాయుడి గా పార్వతీపురం లో పనిచేసాడు
నేను 17 సంవత్సరాల అనంతరం కెనడా లోని రాచకొండ కి (Montreal) మళ్ళి ఇప్పుడు వస్తే వాళ్లిద్దరు తాము ఇక్కడే ఉన్నట్టు నన్నుకలుసుకోవాల్ని అనుకుంటున్నట్టు తపాలాలు పెట్టారు .ఇది గురు లాభం అంటే .ఇద్దరు కనక లాభాలు అనచ్చు అని అంటున్నాను
Leave a Reply