Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

వలస దేవర నవల

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడో 2006 డిసెంబర్ కి ముందు వ్రాసిన నవల వలసదేవరా కి నేను ఇప్పుడు ఇంత ఆలస్యంగా స్పందించటం తప్పే అయినా దానికి కారణం లేక పోలేదు . నెల క్రితం జరిగిన నాయు ని కృష్ణ మూర్తి గారి అభినందన సభలో మూర్తి గారు ఆ పుస్తకాన్ని ప్రేమగా నా చేతిలో పెట్టేవరకు చూడలేదు.ఎప్పుడు "శర్మా ! ఈ పుస్తకం చదివావా ? అంటూ మంచిపుస్తకాల విషయం లో నిలదీసే నన్ను నిలదీసే వల్లం పాటి ఎందుకు అడగలేదు తెలియదు. పైగా ఆ పుస్తకం వెనకాతల అట్ట మీద అతను చేసిన ప్రశంస ఉంది .అంటే అతను చదివాడు. నాకు చెప్పలేదు అందుచేత ఈ నా తప్పు కి అతను కూడా కారణం . ఈపుస్తకం చదవటం నాకు ఒక గొప్ప అనుభవం. . విశ్వనాధ వారిటీవారి వేయిపడగలతో పోల్చే సాహసం చేస్తున్నాను.
అందులోను ఇందులోనూ మూడు తరాల కాలం ఒక పల్లెలో వచ్చిన మార్పుల పట్ల రచయితలు పడిన వ్యధలు చిత్రితమై ఉన్నాయి.
ఈ వెనక చూపు కాదు. గతం ఎలాగూ మాసి పోతుంది. మనం మర్చి పోవచ్చు కానీ గతం లోని మంచి కూడా మాసి పోవటం రచయితలకే కాక నన్ను కూడా బాధిస్తుంది.
వేయి పడగలలో కంఠం విశ్వనాధది ఇందులో వినిపించేది పుంగనూరు జవాన్ గొంతు .ఇతను అమాయకుడు ,తింగరి, మంచివాడు. అతను కథ చెప్పేతీరు అద్భుతం .ఆ విధం గా అటువంటి వాడే చెప్పగలడు.
నేనింకా జంగం దేవర చదవాల్సి ఉంది

Written by kavanasarma

May 12, 2017 at 3:11 pm

Posted in Uncategorized

%d bloggers like this: