Kavana Sarma Kaburlu

All Rights Reserved

ష్రోడింగర్ యొక్క తరంగ ప్రమేయం

leave a comment »

తరంగ ప్రమేయం అనేది ,ఒక అలల సమూహాన్ని గణిత శాస్త్ర భాషలో వివరిస్తుంది. అటువంటి తరంగ ప్రమేయాలతో కూడిన తరంగ సమీకరణాలను శాస్త్రజ్ఞులు సాధిస్తూ ఉంటారు. శబ్ద త్గరంగాల . తీగల ప్రకంపనాల ,నీటి అలల సందర్భాలలో న్యూటన్ యొక్క యాంత్రిక శాస్త్ర సమీకరణ లు వాడతారు.
కాంతి కెరటాల కి మాక్స్వెల్ సమీకరణాలని పదార్ధ తరంగాలికి ష్రోడింగర్ సమీకరణాన్ని వాడుతారు.
అన్ని రకాల తరంగాల ప్రమేయం లో ప్రదేశం తో మారే ఒక రాసి కాలం తో మారే ఒక రాసి ఉంటాయి. కా లం తో మారే భాగం లో ఒకటి లేక అంతకు మించిన తరచుదనాలు( frequencies) , వాటికి సంబంధించిన మూపురాల ఎత్తులు ( amplitudes) ఉంటాయి. ష్రోడింగర్ పిల్లి ఉదాహరణలో చావుకి బతుకు కి సంబంధించిన రెండు అలల మూపురాలు పక్క పక్కనే ఉండి ప్రయాణిస్తూ ఉంటాయి. పెట్టె తెరిచిన క్షణం లో ఏ మూపురం ఉంటె ఆ సంఘటన జరిగినట్టుగా పరిశీలిస్తాం . కాంతి, పదార్ధ తరంగాల ప్రమేయాలలో ప్రదేశానికి సంబంధించిన ఒక యదార్ధ ( real) భాగం , కాలానికి సంబంధించిన ఒక ఊహాత్మక (Imanginary) భాగం ఉంటాయి. ఈ రెంటి లబ్దమే ఆ ప్రమేయాలు.
అలలు కాలప్రదేశ ఆవరణ లో సంభవాలగా వ్యాపించి ఉంటాయి

పరిమాణిక వ్యవస్థలో చాలా సంభావ్యములు ఉంటాయి. .ఈ సంభావ్యములకు కాలం తో మారే సంభావ్యతలు ఉంటాయి . అంటే ఈ సంభావ్యతలు పరిణామం ( evolve) అవుతూ ఉంటాయి ఉదాహరణకి పేక దస్త్రం లో పై ముక్క కళావరు రాజు అవటం కి మొదట్లో సంభావ్యత 1 లో 52 వ వంతు . మొదటి ముక్క అది కాక పోతే రెండో ముక్క అది అవటానికి సంభావ్యత 1 లో 51 వ వంతు .

.సంభవ్యాలు ( Possibilities ) కాలక్రమేణా అంతకు ముందు జరిగిన సంఘటనల వలన ,శక్యాలు ( potentialities) గా పరిణామం చెందు తాయి. అసలు ఏ పరిశీలనా , కొలతా జరగక పోయినా కూడా , అంటే సంఘటనలు జరగక పోయినా కూడా సంభావ్యయాలు ఒక దానితో ఒకటి జోక్యం కలిగించుకుంటూ కాలం లో పరిణామం చెందుతూ పోతూ ఉంటాయి. మనంపరిశీలించినక్షణం లో ఈ శక్యాలలో ఏ అల మూపురం అక్కడ ఉందొ ఆ శక్యం సంఘటన( actuality ) గా మారుతుంది అయితే అన్ని సంభవాల సంభావ్యతలు సమానంగా ఉండకపోవచ్చును. వీటి సంభావ్యతలలో ఎక్కువ తక్కువలు సాధారణం గా ఉంటాయి. పరిమాణిక భౌతిక శాస్త్రం లో జరగబోయే చాలా సంఘటనల బాణీలు (patterns) అంతకు ముందు జరిగిన సంఘటనల వలన బయట పడుతూ ఉంటాయి.. ఆ కారణం గా వాటి గురించి జోశ్యం ( prediction ) సాధ్యం అవుతుంది.
ఈ సంభావ్యత లు కూడా కాలం లో పరిణామం చెందుతాయి కనక వీటిని కూడా అలలతో భౌతిక శాస్త్రజ్ఞులు సంకేతిస్తారు
ఒక పరిమాణిక వ్యవస్థలో ఒక ఎన్నుకున్న క్షణం యొక్క సంభవ్యాల సంభావ్యతలని గణించటానికి ష్రోడింగర్ అల ప్రమేయాన్ని సంభావతా ప్రమేయాన్ని జమిలి గా వాడుతారు .
ఈ క్షణం లో మీరు ఈ వాక్యాలు చదవటం వెనకాతల ఇంత కథ ఉంది.

Advertisements

Written by kavanasarma

May 8, 2017 at 11:06 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: