Kavana Sarma Kaburlu

All Rights Reserved

పరిమాణిక భౌతిక శాస్త్రం

leave a comment »

8. పరిమాణిక భౌతిక శాస్త్రం ప్రాధమిక పరిమాణిక యాంత్రిక శాస్త్రం (Elementary quantum mechanics)1900 నుంచి 1930 వరకు ఉన్న మధ్య కాలం లో ఐన్ స్టీన్, నీల్స్ బోర్, డిరాక్ , ష్రోడింగర్ ,ప్లాంక్, హైసెన్బర్గ్ ల కృషి వలన రూపొందింది .అది ప్రతి దినం మనం గమనించే చిన్న పెద్ద భౌతిక యదార్ధ విషయాలకి సంబంధించినది. నక్షత్రాల అణుశక్తి ,రసాయనాల రంగులు ఘనపదార్ధాల సత్తువ లేక త్రాణ (strength), విద్యుత్ ప్రసారం ఇలా ఎన్నో ఇది వివరిస్తుంది
ఎలెక్ట్రాన్లు ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యకి దూకి నప్పుడు మారే శక్తి చిరు పరిమాణాల్లో ఉంటుంది ఈ చిరు పరిమానామ్ విభజించటానికి అవదు. ఈ చిరు పరిమాణాన్ని పరిమాణిక అందాం . ఈ దూకుడిని పరిమానిక దూకుడు అందాం .
ముందర ముక్కలు ముక్కలు గా ఉన్న ఈ శాస్త్రం ఒక వ్యవస్థీకృతమూ పొందిక తో కూడింది అయిన గణిత సమీకరణాలతో చిత్రిత మైన ఒక నిండైన పరిమాణి క శాస్త్రం గా 1930 నాటికే స్థిరపడింది.
న్యూతనికా భౌతిక శాస్త్రం లో కొన్ని అలలు గాను కొన్ని రేణువులు గాను ఉంటాయి. .ఉదాహరణకి వెలుగు రేణు మయం. .శబ్దం ఒత్తిడి అలల తో కూడినవి .ఈ అలలు ప్రయాణించాలంటే మాధ్యముం కావాలి . (అందుకని సూర్యుడి నుంచి మనకి వెలుగు ఈథర్ అనే మాధ్యమం ద్వారా ప్రయాణించి వస్తుంది అనే తప్పుడు ఊహ ని న్యూటన్ చేసాడు ) కి . పరిమానిక భౌతిక శాస్త్రం లో వెలుగు అలలుగాను ఉంటుంది రేణువులుగాను ఉంటుంది. ( ఒక వెలుగు వెలువడే స్థానం లోను వెలుగు చేరే స్థానం లోను రేణువులుగా ఉండి ప్రయాణించేటప్పుడు అలలుగా ఉంటుంది !) ఈ అలలు ప్రసరించటానికి మాధ్యమం అక్కర లేదు .
అలరేణువు అనేఅద్వైత భావన లో ఆలణువులు ( wavicles ) అనేవి కొన్ని సమయాల్లో అలలు గా మరి కొన్నిసమాయాలలో రేణువులు గా ఉండే శక్యాలని కలిగి ఉంటుంది. ఒక పరిమాణిక అస్తిత్వి ( అస్తిత్వం కల ది, Entity) అల గా ఉన్నప్పుడు ద్రవ్య వేగాన్ని, రేణువు గా ఉన్నప్పుడు స్థానాన్ని కలిగి ఉంటుంది . మనం పరిశీలించినప్పుడు మనకి ద్రవ్య వేగంతో, స్థానంలో తెలుస్తుంది. ఒకటి నిశ్చయం గా తెలిసి నప్పుడు రెండోది మసక అయి పోతుంది. అదే హైజెన్ బర్గ్ అనిశ్చిత సూత్రం .ఇదే ష్రోడింగర్ చెప్పిన శక్యాలు ఎన్ని ఉన్నా చూసినప్పుడు ఒకే సంఘటన గా కనపడుతుంది అని చెప్పిన విషయం
పరిమాణిక భౌతిక శాస్త్రం లో ఒక సంఘటన జరగటానికి గల సంభావ్యతే ఉంటుంది .ఏదన్నా జరిగిందఅంటే దానంతట అదే జరుగుతుంది అంతే కానీ ఏది జరిగి తీరాలన్న ఆ నియమం లేదు. .ఇందులో స సాధారణ మైన వి కలిసి సంబంధం ఏర్పడినప్పుడు కొత్త గుణాలు పుట్టుకు వస్తాయి వీటిని బయటపడే ( ప్రాదుర్భావ )గుణాలు ( emergent properties) అంటారు .సమస్తం విడి భాగాల మొత్తం కంటే హెచ్చు అన్న సమ స్తత్వ భావానికి ఈ బయటపడే కొత్తగుణాలే కారణం. .పరమాణిక యధార్ధత లోని భాగాలు , మనకు కానరాని గొప్ప సమస్తం లోని భాగాలు సఖ్యము గా ఊగిసలాడుతూ ఒక దానికి ఒకటి ప్రతి స్పందించి సంబంధం పెంచుకోవటం వలన ఏర్పడుతాయి.ఈ యదార్థత కి కారణాలు ఇక్కడవే అయి ఉండక్కరలేదు.
పరిశీలన పరికరాన్ని ( పరిశీలకుడిని) పరిశీలనని విడదీసి చూడలేము. . అందుచేత పరిమానిక యధార్ధత , నౌలికం గా మనం అనుదినం చూసే యదార్థత కి భిన్న మైనది . 1964 లో ఫిజిక్స్ కి గాను నోబెల్ బహుమతి పొందిన ఫెయిన్మన్ " పరిమానిక భౌతిక శాస్త్రాన్ని అర్ధం చేసుకోవటం అసాధ్యం,.ప్రయత్నించటం వ్యర్థం "అని ( స్వభావ రీత్యా ) కొంత హాస్యం గా అంటాడు కానీ ఈ పరిస్థితి మారుతోంది కొత్త విశ్వవీక్షణం కి యాడ్లు నెమ్మదిగానే అయినా తొలిగి పోతున్నాయి

Advertisements

Written by kavanasarma

April 19, 2017 at 3:58 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: