Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

రెండో సైన్స్ విప్లవం.

6. రెండో సైన్స్ విప్లం – ఆవశ్యకత

న్యూటనిక సైన్స్ లో వ్యవస్థ యొక్క నిర్మాణం ఒక అంతస్థుల నమూనా లో ఉంటుంది . కారణం -ప్రభావం ( cause and effect) అనే గట్టి న్యాయాలతో జరగబోయే సరళమైన మార్పుని ఈ సైన్స్ ఇస్తుంది . దీని , ప్రదేశం- కాలం చట్రం లో సత్యం అవును గానో కాదుగానో ఉండాల్సిందేగాని సందిగ్ధం ఉండటానికి వీల్లేదు .భిన్నత్వం తో ఇది వేగ ( చాల ) లేదు. ఇదీ , అదీ కూడాను, అనే కొత్త ఆలోచన యొక్క అవసరమైతే తెలుస్తోంది కానీ దానికి అవసరమైన ,పొంతన గల నమూనా ఇంకా ఏర్పడలేదు .
ఈ నమూనా అవసరం మైకెల్సన్ , మార్లే లు 19 వ శతాబ్దం చివరలో వెలుగు వేగం కొలవటానికి చేసిన ప్రయత్నం తో బయటపడింది. భూమితో వెలుగు సాపేక్ష వేగం, దాని అసలు వేగం ఒకటే అని ఆ ప్రయోగాలు చెప్పాయి. అంటే భూమి వేగం సున్నా అయినా అయి ఉండాలి. లేక వెలుగు వేగం సాపేక్షికం గా మారదు, అది స్థిరం అని అయినా ఒప్పుకోవాలి. భూమి వేగం సున్నా కాదు కనక ఆ వెలుగు వేగమే స్థిరం అనుకోవాల్సి వచ్చింది ఇది ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి దారి తీసింది .
నల్ల బొంది ( Black Body ) నుంచి వెలువడే వికిరణం (radiation) విషయం లో పాత సైన్స్ ,అతి నీల లోహిత ( Ultra Voilet) రంగు వద్ద ప్రకాశం అనంతమైపోవాలని చెప్తుంది . కానీ ప్రయోగాలు, తరచు దనం (frequency) కి ప్రకాశానికి ఉన్న బాంధవ్యం, ఒక గంట ఆకారపు వంపు గీత గా చూపించాయి . దీనితో పరిమాణిక సిద్ధాంత రూపకల్పనకు సైన్స్ లో మొదటి అడుగులు పడ్డాయి . మరో 60 సంవత్సరాలు గడిచాక 20 శతాబ్దం లో మరో జోస్యం (ప్రిడిక్షన్ ) కి వ్యతిరేకం గా , క్రమ రాహిత్యపు సమాచారం పోగు పడింది. ఆ సమాచారం తో విపరీత క్రమరాహిత్యము – సంక్లిష్టత ( Chaos and complexity) అనే మరో సిద్ధాంతానికి దా రి ఏర్పడింది. ఈ కొత్త సైన్స్ శాఖలు పాత సైన్స్ కి పొడిగింపులేకాని, భౌతిక మైన యధార్ధత గురించి అవి చేసిన ఊహనలు ( assumptions) విపరీతమైనవి క్షుణ్ణం గా భిన్నమైనవి .

ఒక సంఘటన మరో దానికి దారి తీసే విషయం లో , కొత్త ఆలోచనా విధానం, కొత్త గణితం ,కొత్త వర్గీకరణ ,వాటిని వివరించే కొత్తసూత్రాలు కావాల్సి వస్తాయి.

(పురాణాలు ప్రబంధాలు వ్రాయటానికి అనువైన భాష కథలు వ్రాయటానికి సహకరించకపోవటం తో . కట్టుబాట్లు వదిలించుకున్న వాడుక భాష కావలసి వచ్చింది. అల్లాగే సైన్స్ వ్రాయటానికి మళ్ళీ కొత్థ నిబంధనలతో స్థాయి కరణ పొందిన తెలుగు ని తయారు చేసుకోవాల్సి వచ్చినట్టుగా )

మరో సారి పాత సైన్స్ కి, కొత్త సైన్స్ కి కొట్ట వచ్చినట్టు ఉండే తేడాలు చెప్పుకుందాం.పాత దాంట్లో పరిశీలకులు పరిశీలనలు వేరు. వేరు విషయాలు. ఇందులో అవి ఒకే విషయానికి చెంది రెండు అంశాలు . కాలం ప్రదేశం అందులో వేరు వేరు. ఇందులో ,కాలం కేవలం నాలుగో కొలత .
పాత సైన్స్ లో మార్పు ఆ విచ్చిన్నం, సరళం . కొత్త సైన్స్ లో మార్పు అకస్మాత్తుగా , అతి వేగంగా , తీవ్రం గా రావటమే కాక , ఆ మార్పు అంతకు ముందు ఉన్నదాని తాహతు ( scale) కి సంబంధము లేకుండా వస్తుంది.
పాత దాంట్లో మార్పు ,కొంత వరకు నిశ్చితత్వం కలిగి జోస్యం ( prdection) చెప్పగలిగి ఉంటుంది. కొత్త దాంట్లో ముందు రాబోయేది , చెప్పలేని బలహీనత ఉంది. అనిశ్చితత్వం , అసరళత్వం ల నిది నొక్కి వక్కాణిస్తుంది
గడియారం లా నడిచే న్యూటన్ యొక్క విశ్వం, ఈ కొత్త శాస్త్రజ్ఞుల చేతిలో పాచికలతో నడిచేది అయి పోతుంది. . జూదశాల అయిన మోంటే కార్లో లో వాడే విధానానికి ,సైన్స్ పద్ధతి ,కొన్ని సార్లు దారి ఇవ్వక తప్పదు.
పాత సైన్స్ లో విశ్వం లోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి కారణం -ప్రభావం ( తెలుగు లో కార్య కారణం సంబంధాలని అంటారు. అయితే కారణం కార్యానికి ముందు ఉండాలనే నిబంధన ని ఆ మాట సూచించదేమో అని నా భయం )అనే గట్టి న్యాయాలతో కట్టి పడేసి ఉంటాయి. . ఈ కొత్త సైన్స్ తాలూకు విశ్వం లోని భాగాలన్నీ చిక్కు ముడులు పడి ఉంటాయి బలాల( forces) , సంకేతాలు ( signals) లేని సందర్భాలలో కూడా అంతర్గతం గా ఉన్న ఏదో క్రమం వలన , విడి భాగాల లో ప్రదర్శితం కానీ బాణీలు ( patterns) బయట పడతాయి. సహా సంబంధాలు (correlations) వాటంతట అవే వికసిస్తాయి .
ఏ కొత్తది , ఆశ్చర్య కరమైనది జరగని యాంత్రిక విశ్వాన్ని తొలగించి , నిరంతర సృజన తో కూడిన విశ్వం దాని స్థానం ఆక్రమిస్తుంది , ఈ కొత్త సైన్స్ లో . సమస్తం (Whole) విడి భాగాల మొత్తం ( sum ) కంటే హెచ్చు అయినది అన్న భావాన్ని ఈ కొత్త సైన్స్ ఒప్పుకుంటుంది.
పాత సైన్స్ లోని సంఘటిత సరళత్వం బదులు , కొత్త సైన్స్ లో స్వయం సంఘటిత ( self organised) సంక్లిష్టత ని ఊహిస్తారు .

Written by kavanasarma

April 16, 2017 at 3:14 am

Posted in Uncategorized

%d bloggers like this: