Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

5 కొత్త ఆలోచనలు

కొత్త సైన్స్ పూర్తిగా సూత్రీకరింపబడి ఇప్పటికి 90 సంవత్సరాలు దాటినా ,( గందరగోళం ( విపరీతమైన క్రమ రాహిత్యం ,Chaos) సంక్లిష్టత ( Complexity) లాంటి కొత్త విపరీతమైన సైన్స్ శాఖలు కాల ప్రవాహం లో వచ్చి చేరినా ఈ కొత్త సైన్స్ యొక్క కేంద్ర భావాలతో చాలామంది శాస్త్రజ్ఞులు ఇంకా ఇమడలేక పోతున్నారు. ఎందుకంటే ఈ భావాలకి పాత సైన్స్ భావాలకి చుక్కెదురు. అ నిశ్చితత్వం , ఆ సరళత్వం , ఆకారణత్వం . వెలుగు కున్న రేణు, ఆల స్వభావం ఒకే సమయంలో బతికి, చచ్చి ఉండే పిల్లి , పరిశీలకుడు జోక్యం కలిగించుకునే పరిశీలనలు ఈ సైన్స్ యొక్క కేంద్ర భావాలు.
పాత సైన్స్ కి ప్రియమైన అన్ని భావాలతోను ఇది విభేదిస్తుంది

సాపేక్షసిద్ధాంతానికి పరిమాణిక సిద్ధాంతానికి లంకె ఏమిటి ? ఈ రెండు, గందరగోళ శాఖ తోను , సంక్లిష్ట శాఖతోను ఏ భావాలని పంచుకుంటాయి ? ఈ కొత్త సైన్స్ వలన మానసిక శాస్త్రం లోను, జీవ శాస్త్రం లోను , విశ్వ శాస్త్రం లోను , వచ్చిన మార్పులు ఏమిటి? ఇవి తెలియ చెప్పగలిగితే కొత్త సైన్స్ గురించి కొంత వివరించినట్టే . ఇవి నా శక్తీ కి మించిన విషయాలు .ఇలాంటి ప్రశ్నలున్నాయని మాత్రమే చెప్పదలచుకున్నాను
తదుపరి Post లో రెండవ సైన్స్ విప్లవం గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. లోపలి వెళ్తున్న కొద్దీ లోతు పెరుగుతుంది. ఎక్కడ మునిగి పోతే అక్కడ ఆపేస్తాను

Written by kavanasarma

April 14, 2017 at 11:22 pm

Posted in Uncategorized

%d bloggers like this: