ప్రపంచమొక యంత్రం అసంతృప్తి
4 యాం త్రిక ప్రపంచం . న్యూటనిక విశ్వవీక్షణం . లో ఎం మొత్తాన్ని ముక్కలుగా విడగొట్టి అధ్యనం చేయచ్చు , ప్రపంచంలో బాంధవ్యాలు అన్ని సరళరేఖలాగా (linear ) సంక్లిష్టత లేకుండా ( simple)ఉంటాయి .అంతా నిశ్చితం ( determinstic గా తెలియటం వలన జరగ బోయేవి బోయేవి జోస్యం చెప్పవచ్చు ( prediction) అనే వాటితో పాటు ఈ ప్రపంచం లంతా ఒక పెద్ద యంత్రం అనే భావం కలిగించింది.
"అక్కడ పనులన్నీ కందెన (lubricant)పెట్టిన యంత్రం లో జరిగినట్టు, ఏ ఘర్షణ లేకుండా నున్నగా జరిగి పోతు ఉంటాయి " . " ఉద్యోగస్తులు పాలన అనే యంత్రం లో పళ్ళు , పళ్ళ చక్రాలు (అంగాలు ) "
"పనిలో దక్షత ( efficiency ) .పెంచాలి "
" అతను అన్ని సిలిండర్లు పనిచేస్తున్న వాడిలా ఉండక ఒకే సిలిండర్ మీద పని చేస్తున్న వాడిలా నీరసం గా ఉంటాడు " మన మనసు మీద లాగుడులు ( pulls) తోపుడులు ( Pushs) పనిచేస్తాయి."
ఇటువంటి భావజాలం అంతా ఈ విశ్వవీక్షణానికి సంబంధించినదే
న్యూటన్ ప్రతి పాదిం చిన భౌతిక సిద్ధాంతాలమీద ఇంతో అంతో ఆధారపడ్డవే జాన్ లోక్స్ యొక్క వ్యక్తి వాదం , ఏడం స్మిత్ యొక్క స్వార్ధ ఆర్ధిక వాదం , డార్విన్ యొక్క (గుడ్డి ) పరిణామ వాదం , ఫ్రాయి డ్ యొక్క అణిచి వేయబడ్డ కోర్కెల వాదం . ఇవి మనిషి జీవితం లో నిశ్చితత్వం , ( certainity) , సంభావ్యత ( Chance) లే కానీ ఐ చ్ఛికత ( ఎంపు , Choice ) లేదు అన్న భావం బలం గా నాటటం తో దీని పట్ల వ్యతిరిక్తత మొదలు అయింది. అవి ముందుగా కళల లోను సాహిత్యం లోను ప్రదర్శితమయ్యాయి లేక తలెత్తాయి. చాప్లిన్ తీసిన మోడరన్ టైమ్స్, తర్కాన్ని కారణాన్ని నిరసించిన Dada వాదం ఒకే దృష్టి కోణాన్ని వ్యతిరేకించిన Cubic వాదం , సాంకేతికను నిరసించిన ఇలియట్ వ్యర్ధ భూమి అనే పుస్తకం ఇఇ వ్యతిరిక్తతకి ఉదాహరణలు .ఇవన్నీ ఐన్ స్టీన్ సాపీక్త్త సిదాంత కాలానివె అవటం యాదృచ్చికం కాదు. .అప్పుడే న్యూటనిక విశ్వ వీక్షణానికి భిన్నమైన కొత్త చూపు ఏర్పడుతోంది
Leave a Reply