Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా గోడు

నా గోడు నేను 11 వ తరగతి వరకు తెలు మీడియం లో చదువుకున్నాను. మాకు ఇంగ్లిష్ 7 వ తరగతిలో మొదలు పెట్టారు. 1949-50 .హిందీ గాని సంస్కృతం కానీ చదువుకోవచ్చు.
10 వ తరగతిలో 1952-53)హిందీ తప్పని సరి సంస్కృతం గాని స్పెషల్ తెలుగు గాని చదవ వచ్చు అన్నారు. అన్ని ప్రయోగాలు చేయటానికి ప్రభుత్వానికి స్వతంత్రం అప్పుడే వచ్చింది కదా . 1951 లో మనం రాజ్యాగాన్ని ఆమోదించుకున్నాము
12 -13 తరగతులని ఇంటర్మీడియట్ అనే వారు. అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్. maths &physics ఏ సమస్యా రాలేదు వర్ణనా త్మకం ( డిస్క్రిప్టివ్) subject అయిన chemistry అర్ధమయ్యేది కాదు. ఆ weakness in that branch of science కొనసాగుతూనే ఉన్నది
ఇంజనీరింగ్ లో అదే సమస్య వర్ణనాత్మకమైన సబ్ జెక్ట్ ల లో పరీక్షలు వ్రాయటానికి కావలసిన ఇంగ్లీష్ పరి జ్ఞానం ఉండేది కాదు. . కే ఖరాగపూర్ లో M.Tech చేసి వచ్చి AU లో lecturer అయ్యాక ఇంగ్లిష్ నేర్చుకున్నాను.
IISc lo Ph.D ( 1962) కి చేరి , research papers ని జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించాల్సి రావటం తో చచ్చినట్టు ఇంగ్లిష్ అలవడింది.
1973 లో "Writing Science and Technology in Mother tongues" అన్న జాతీయ సదస్సులో అన్ను తెలుగు పతాకం ఎగర వేయమన్నారు. అప్పుడు నా Ph.D. విషయమైన Sediment Transport నే విషయం గా స్వికటించి " ఎటి ఇసుక నీటి మోత " అన్న వ్యాసం చదివి తరువాత ప్రచురించాను
ఆ విధం గా రంగ ప్రవేశమే ఒక advanced topic తో చేయటం వలన నాకు అటువంటివి ఎలా వ్రాయాలి. ? అన్న ప్రశ్న తలెత్తింది .
జనీకరణ ( popularization ) నా లక్ష్యమా తెలుగుని ఆధునికీకరించటం నా లక్ష్యమా ? తేలుచుకోవాల్సి వచ్చింది. నేను రెండో దానికే మొగ్గు చూపాను.
మాటలు కొత్తవి పుట్టించటం ఎంతవరకు మంచిది.?
ఇంగ్లిష్ Jargon యధాతధం గా వాడుతూ తెలుగు లో వ్రాతే నా తరం వాళ్ళకి చదవటానికి సుఖం గా ఉంటుంది. కానీ వాలు నా targeted readers కారు నా పిల్లల , మనవల తరాలలో ఆంగ్ల మాధ్యమం లో చదువుకున్న వారు , నా targeted readers కారు.
నా గురి , చిన్నప్పటి నుంచి తెలుగు లోనే చదువుకుంటూ పై చదువులు కూడా తెలుగు మాధ్యమం లో చదువుకునే వారి పైనే. . ఆ గుంపుకి ఇంగ్లిష్ పుస్తకాల అనువాదాల లాంటి పుస్తకాలే కానీ , విషయం సులువుగా అర్ధమయ్యేటట్టు , తెలుగు లో వచ్చిన సొంత రచనలు అందు బాటు లో లేక పోవటం ( Prof Vemuri Venkateswara Rao, Prof Kandula Sita ram Sastry and a few others are exceptions) గమనించాను.
సైన్స్ ఒక్కొక్క శాఖలో వికసించిన పద్ధతి గురించి నేను ఇంగ్లిష్ లో నేను చదివినవి నన్ను ముగ్ధుడిని చేశాయి. Ascent of Science , Management of Diabetes , Frekonomics , Travel of Light from Newton to Einstein Who is afraid of Schrodinger’s cat అందులో కొన్ని

ఇప్పటికీ సైన్స్ నడచిన బాట , మధు మొహం, వెలుగు పయనం వ్రాసాను .ఇప్పుడు కొత్త సైన్స్ వ్రాస్తున్నాను .
తెలుగు ఇంగ్లిష్ ల లో బాగా ప్రవేశమున్నా సైన్స్ ,సాంకేతిక శాస్త్రాలలో పరిచయం పెంచుకుందామనుకునే కుతూహలం ఉన్న నాతరం వారికి నా పద సృష్టి, పంటి కింద రాళ్లు గా ఉంటాయని తెలుసు. కానీ మొదటి నుంచి సైన్సు ఇప్పటిదాకా తెలుగులో చదువుకున్న వారికి జంతికముక్కల్లా గట్టిగాను రుచిగాను ఉంటాయి అని ఆశిస్తున్నాను

Written by kavanasarma

April 14, 2017 at 2:41 am

Posted in Uncategorized

%d bloggers like this: