Kavana Sarma Kaburlu

All Rights Reserved

పాత సైన్స్ 3

leave a comment »

పాత సైన్స్ 3

మన ఇవాళ కొత్త సైన్స్ అంటున్నదానికి ముందున్నది పాత సైన్స్

దీనిని ఒకప్పుడు ఆధునిక సైన్స్ అనే వారు కూడాను( చార్లీ చాప్లిన్ Modern Times సినిమా గుర్తు ఉంది కదా ) . 1687 లో న్యూటన్ తన 3 న్యాయాలు ప్రకటించటం తో సైన్స్ లో మొదటి విప్లవం వచ్చింది. .దాని వెంటనే పారిశ్రామిక విప్లవం వచ్చింది.
,వివేచన మీద సాక్షాత్కారాల మీద మతం యొక్క తాత్వికత యొక్క సత్యాలు ఆధారపడి ఉండగా పరిశీలన పైన ప్రయోగాల పైన విశ్లేషణమీద న్యూట నికసైన్సు లో సత్యాలు గా స్వీకరించబడేవి ఆధారపడతాయి . ప్రపంచం , పరిశీలింప గలిగిన సమాచారాన్ని కలిగి ఉందని , ఆ సమాచారాన్ని విశ్లేషించి సరళమైన , సులభమైన న్యాయాలు సూత్రాలు గా రూపొందించ వచ్చని వాటితో ఈ ప్రకృతిని అర్ధం చేసుకుని ఆధిపత్యం సంపాదించి మనిషి జీవితాన్ని సుఖ వంతం చేయ వచ్చునన్న నమ్మకం ఈ సైన్స్ కలిగించింది .
ఒక మొత్తాన్ని చిన్న చిన్న మౌలిక మయిన ముక్కలుగా విడగొట్టి అధ్యనం చేస్తే మొత్తం అర్ధమై పోతుందని భావించట మైనది . అడవి ని అర్ధం చేసుకోవటానికి అందులో ఉండే మొక్కలని జీవ జాలాన్ని విడి విడి గా అధ్యనం చేసి కల బోసుకుంటే మొత్తం అర్ధమైపోతుంది అనే భావం ఈ న్యూట నిక విశ్వ వీక్షణం కలిగి ఉంది. దీనివల్లే మనకి ముక్కు నిపుణులు ఎముక నిపుణులు లాంటి వర్గాలు ఏర్పడ్డారు .
కారణం ( ఉదాహరణ: బాహ్య బలాలు) తెలిస్తే కార్యం (ఉద: గతి ) తెలుస్తుంది అనే నిశ్చితవాదం దీని ముఖ్య అంగం .
మనిషి- దైవం , దేహం -,ఆత్మ అనే ద్వైత భావనల లాగే పరిశీలించబడేది పరిశీలకుడు వేరు అనే ద్వైత భావం ఈ న్యూటనిక సైన్స్ కలిగి ఉంది .
వ్యక్తి నిష్టం కాని వస్తు నిస్టత ఉన్నద ని దాన్ని శాస్త్రజ్ఞుడు ,ఈ భౌతిక ప్రపంచాన్ని , దానికి దూరం గా ఉండి , పరిశీలించగలడ న్న నమ్మకం ఈ సైన్స్ కలిగించింది. న్యూటనిక సైన్స్ ఇప్పటి దాకా మన ఆలోచనలని ప్రభావితం చేస్తూనే ఉంది. దాని కి భిన్నం గా ఆలోచించగలిగితేనే మనకి కొత్త సైన్స్ అర్ధమవుతుంది

Advertisements

Written by kavanasarma

April 12, 2017 at 11:12 pm

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: