Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

పరిమాణిక ప్రపంచం.

సాధారణ ప్రపంచంలో ఒక పిల్లి బతికి ఉండటమే చచ్చి ఉండటమో చూస్తాం. కానీ పరిమాణిక ప్రపంచం లో ఆ పిల్లి మనం చూసే వరకు బతికీ ఉంటుంది , చచ్చి ఉంటుంది . మనం చూడటం , ఆ పిల్లి ని బతికి ఉన్నదానిగానో చచ్చి ఉన్నదానిగానో చేస్తుంది. .అంటే పరిశీలకులు పరిశీలనల లో భాగస్వాములు అయి ఉంటారు పరిశీలనా ప్రపంచం లో ఒక విషయం అయినట్టో కానట్టో ఉంటుంది . . కానీ పరిమాణిక ప్రపంచంలో సంభవించటానికి అవకాశం ఉన్న అన్ని సంఘటనలు పరస్పర విరుద్ధమైనవి కూడా కలిసే ఉంటాయి.
ఈ సైన్స్ ని మన అనుదిన ప్రపంచానికి సంబంధించిన సాధారణ జ్ఞానం ( common sense ) తో అర్ధం చేసులోలేము. .కొత్త ఆలోచనా విధానం కావాలి. సాధారణ జ్ఞానం అనే దాని నే మార్చుకోవాలి
సంభావ్యతలు( Potentialities) ఎన్నో. అందులో కొన్ని పరిశీలన వలన సంఘటనలు ( Eventualities)గా మారుతాయి.
ఈ శాస్త్రం లో కొన్ని విషయాలు చెప్పేవారికి వినే వారికి కూడా అర్ధమవుతాయి. కొన్ని వినేవారికి సంపూర్ణం గా అర్ధం కాక పోయినా చెప్పేవారికి అర్ధమయినవె అని మనకి తెలుస్తుంది. కొన్ని చెప్పే వారికి కూడా చెప్పా గలిగినంత బాగా తెలియవు అనిపిస్తుంది .ఈ కొత్త సైన్స్ ని సృష్టించటం లో సహాయ పడిన నీల్స్ బోర్ కి ఈ కొత్త సైన్స్ కొరుకుడు పడలేదు ఐన్స్టెయిన్ కి చచ్చే వరకు ఇది నచ్చే లేదు, ఆయన కి పేరు ప్రఖ్యాతులు రావటానికి ఈ సైన్స్ చేసిన దోహదం చాలా ఉన్నా !.

Written by kavanasarma

April 12, 2017 at 9:29 am

Posted in Uncategorized

%d bloggers like this: