Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ఊలు బంతి బాడ్మింటన్ గోలిసోడాల పందాలు పిచ ్చయ్య

మా చిన్నప్పుడు మా హీరో పిచ్చయ్య గారు. ఆయనకీ అతి ఆలస్యంగా అర్జున్ పురస్కారం ఇచ్చారు. ఆయన బాల్ బాడ్మింటన్ ఆడటం లో నిష్ణాతుడు . అయన అదే విధం గురించి మేము రకరకాల కథలు చెప్పుకుని మురి సి పోయేవాళ్ళం ఆయనని 192 లో వరంగల్ లో చూసి తరించాను ఇంతకు ఈ ఆటా చాలామందికి తెలియదు. ఇది అతి చవక అయినా ఆట . ఒక నెట్, 4 వెదురు కర్రలు రెండు మేకులు చాంతాడు ఒక ఊలు బంతి .
ఊలు బంతి 1. రూపాయ పావలా . 4 వెదురు కర్రలు 2 రూపాయి ( నెట్టు కి రెండు జతల కత్తెర బొట్లు ) నారాయణ బాట్ 6 రూపాయలు .నాకు నా మొదటి కథ పిల్లిమెడలో గంట కు గాను ఆంద్ర పత్రిక వారు 5 రూపాయలు పంపినప్పుడు 1953 లో మొదటి సారి నారాయణ బాట్ కొనుక్కున్నాను ఇప్పటికి ఒక నారాయణ నా దగ్గర ఉన్నది .( స్కూల్లో కెప్టెన్ , 1996 లో గీతం లో సివిల్ ఇంజనీరింగ్ టీం ని గెలిపించటం 1991 లో బెంగుళూరు సర్వ కళాశాలల ఉపాధ్యాయుల పోటీలో నెగ్గటం నా టోపీ లో ఈకలు ) ఒక ఆటగాడు కట్టాల్సిన ఫీజు నెలకి పావలా .. అది ఊలు బంతులు కొనటానికి
ఇంతకు ఒక జట్టులో 5 గురు ఉంటారు ఇద్దరు ముందు ఇద్దరు వెనక ఒకరు మధ్య .దేని ప్రత్యేకత దానిదే. నేను మధ్యలోకాని ముందు గాని ఆడే వాడిని. ఆ స్థానాల్లో ఆడటానికి రెఫ్లెక్స్ లు బావుండాలి
వేసంగి సెలెవల్లో పొద్దున్నలు ఎల్లమ్మ తోట లో స్నేహితుల జట్టులకి సవాళ్లు విసరటం ఒక విలాసం. పందెం గోలి సోడాలు .సోడా అర్ధణా రూపాయితో 32 వ వంతు . ఒడి పోయినవారు గెలిచినా వారికి సోడా లు ఇప్పించాలి . గెలిచినా వాళ్ళు ఓడిన వారికి ఇప్పిస్తే ఇప్పించ వచ్చు. ఇప్పించి తమ ఉదారత ప్రదర్శించ వచ్చు.
.

Written by kavanasarma

April 5, 2017 at 11:06 pm

Posted in Uncategorized

%d bloggers like this: