Kavana Sarma Kaburlu

All Rights Reserved

ఒక చట్టపరమైన హామీ

leave a comment »

నిన్న రచన సంపాదకులు శాయి గారు దూరవాణి లద్వారా మాట్లాడారు " మీ నవలిక డింకనేష్ మే నెల రచన లో ప్రారంభమవుతుంది " అన్నారు
నేను డిసెంబర్ 2002 కి ఫిబ్రవరి 2012 కి మధ్య ఉన్న దశాబ్దకాలం లో మూడు తడవలు ఇథియోపియా లోనున్న అర్బామించి ( నలభై నీటి బుగ్గలు ఉన్న పట్టణం ) లో జలవనరుల కి తూర్పు ఆఫ్రికాలో పేరు మోసిన విశ్వవిద్యాలయం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగం లో వృద్ధ ( సీనియర్) ఆచార్యుడిగా పనిచేసాను. అప్పుడు నాకు ఎన్నో సంతోషంకలిగించిన అనుభవాలు కోపం తెప్పించిన అనుభవాలు .భౌతికం గా ఆరోగ్యం ఇబ్బందిపెట్టిన అనుభవాలు కలిగాయి. విద్యార్థులు అధికారులు నన్ను అభిమానించారు . ఆ అనుభవాల దారాలు చిక్కుముడులు పడి వాటిలోని అంతఃసూత్రం వెతికి పట్టుకోవటానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. ఆ సూత్రం దొరికాక వ్రాసిన యాత్రా సాహిత్య రూపం లో వ్రాసిన నవలిక అది
ఇప్[పుదూదేశం లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అమరేంద్ర గారు " అవును ఇది యాత్రా సాహిత్యమే " అంటే ఇది ఆ కోవ లోకి చేరిపోతుంది. "ఇది కాదు "అంటూ ఆయన తీర్పు చెప్పితే కాకుండా పోతుంది . అందుకని వారి ని ముదరకొట్టామని బతిమాలుతున్నాను
ఇఇ మధ్య మాయా బజారుకి 60 ఏళ్ళు రచన పత్రిక కి 25 ఏళ్ళు నిండిన సందర్భంగా , రచన ప్రారంభ సంచికలో 25 ఏళ్ల ముందు ప్రచురితమైన నా వ్యాసం మాయ బజార్ ని రచన రజతోత్సవ సంచికలో వేస్తున్నట్టు తెలియ చేస్తూ శాయి గారు చివరో మాట అన్నారు
అది " మీరు మీ మాయాబజార్ వ్యాసం తో పాటు వ్రాసి ఇచ్చిన హామీ పత్రం లో మీ చివరి నవలిక .కథ రచనలోని ప్రచురిస్తామని ఉన్నది కనక మీరు జీవితం లో వ్రాయ బోయే చివరి కథ త్వరగా వ్రాసి పంపండి "
అదృష్టం కొద్దీ నేను నా చివరి సాంకేతిక వ్యాసం రచనకి వ్రాస్తానని వాగ్దానం చెయ్య లేదు .అందుకని జల శాస్త్రం గురించి చైతన్యం పత్రికలో వ్యాసాలే నా చివరి సాంకేతిక వ్యాసాలు . అల్లాగే ఆ వాగ్దానం లో సాహిత్యవ్యాసం ప్రసక్తి లేదు అందుకని చినుకు ( ఫిబ్రవరి 2017) లో వ్రాసిన యాత్ర సాహిత్యం అన్నదే ఆ చివరి వ్యాసం నాకీ 78 ఏళ్ళు నిండే సరికి బహుశా నా చివరి కథ వ్రాయటం పూర్తి అవుతుంది అనుకుంటున్నాను .
ఆ పైనతెలుగు పాఠకులకి నా రచనలు చదావాల్సిన బెడద ఉండదు. ఇది ఈ నుంతన సంవత్సరం లో వారికి నేను చెప్ప దలుచుకున్న శుభ వార్త చేస్తున్న వాగ్దానం
నా భవిష్యత్తు కార్యక్రమం లలో ఒకటి వివిన మూర్తి సప్తతి .అప్పుడు " మా రోజుల్లో మంచికథలు వచ్చేవి నేను మానేసాక రావటం లేదు "అని మగ పెళ్లి వాడైనా శర్మ " ఇది బాగా లేదు అది బాగా లేదు " అనేయచ్చు అనుకుంటున్నాడు

Advertisements

Written by kavanasarma

March 27, 2017 at 2:13 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: