Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

సైన్స్ సాంప్రదాయం – మన గందర గోళం

సైన్స్ లోని మంచి సాంప్రదాయం – మనం పాటించకగందర గోళం సైన్స్ లో ఒక వ్యాసం వ్రాసినప్పుడు పూర్వం ఆ విషయం పైన వచ్చిన వ్యాసాల సమాచారం రచయిత సాధ్య పడినంత మేరకు నంత వరకు సేకరించి అధ్యనం చేసి ,అర్ధం చేసుకుని ఆ సమాచారం లో ఏ విషయాన్నైనా ప్రస్తావించ దలుచుకుంటే ఫలానా వ్యాసం లో ( ఆధార భూతమైన వ్యాసాల పట్టికలో దాని సంఖ్య సూచించి ) ఫలానా విషయం తో నేను ఏకీభవిస్తున్నాను దానిని నా వాదన / ప్రయోగాల తో సమర్ధిస్తున్నాను అనో ఏకీభవించటం లేదు ఈ కారణాల /ప్రయోగాల వలన, అని వ్రాసే మంచి సంప్రదాయాన్ని అంతర్జాతీయంగా అన్ని సార్లు ,జాతీయంగా కొన్ని సార్లు పాటిస్తారు . ఆ సాంప్రదాయం పాటించకుండా ఒక రచయిత వ్రాస్తే అందులో వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నింటికీ స్వంత దారుడు ఆరచయితే నన్న భావం కలిగించే ప్రమాదం ఉంది. అప్పుడు మేధోపరమైన హక్కులకు భంగం వాటిల్లినట్టు భావించటం వలన ఎదురయ్యే ఇబ్బందులు ఆ రచయితకి కలగటం కద్దు.
తెలుగులో రచయితలు సైన్స్ చరిత్రలకి సాహిత్య విమర్శసమీక్షలకు సంబంధించిన వ్యాసాలూ వ్రాసేటప్పుడు తమ వ్యాసాలకి ఆధార మైన పూర్వ వ్యాసాల ప్రసక్తి చేయక పోవాటం గమనిస్తున్నాను . అల్లాగే నేను అటువంటి పట్టిక జత పరిచిన సందర్భాలలో అది ఒక అచ్చు స్థలాన్ని వ్యర్ధపరచటం గ భావించి పత్రికల వారు తొలి గించటం కూడా జరిగింది. అటువంటి సందర్భాలలో అది మేధోపరమైన హక్కుల ఉల్లంఘన గా మూల రచయిత భావించవచ్చు .ఎన్నో సార్లు పట్టించుకోక పోవటం జరుగుతుంది .అదే రక్ష
ఇది నాణానికి ఒక వైపు.భావ సారూప్యం ఉన్న కథల విషయం లో ( ఉదాహరణ ఉద్యోగస్థులకిచ్చే గౌరవం ఆ ఉద్యోగం ఉన్నంత వరకే గురువు కిచ్చే గౌరవం శిషులున్నంతకాలం ఉంటుంది ) ప్రసిద్ధ విమర్శకులు కూడా ఒకటి మూలం అని రెండోది ‘కాపీ’ అని భ్రమ పడటం నా అనుభవం. వాళ్ళు కాపీ రైట్ చట్టం చదివి ఉండక పోవటమే దానికి కారణం అనుకోవాల్సి వచ్చింది.
ఇటువంటి భ్రమలే జీవిత చరిత్ర ల విషయం లో పడటం కూడా నా అనుభవం .
ఉదాహరణ కి రావణుడు సీతని ఎత్తుకు పోయాడు అన్న అంశం తీసుకుందాము. అది రావణుడు సీత జీవితాలకి చెంది సత్యం . ఎవరు వ్రాసినా సీతని రావణుడు ఎత్తుకు పోయాడనే వ్రాయాలి ఎలా ఎత్తుకు పోయాడన్న దాంట్లో విభేదించి వచ్చు వాల్మీకి రావణుడు సీత తొడ పుచ్చుకుని ఎత్తి, తీసుకుపోయాడు అని వ్రాస్తే ,మరొకరు ఆమె నిలబడ్డ భూమిని పెళ్ల గించి ఎత్తుకు పోయాడు అని వ్రాయ వచ్చు అది కాపీ కాదు . రెండో రచయిత తను వాల్మీకి రామాయణం నుంచి కూడా సమాచారం సేకరించాన ని వ్రాస్తే చాలు ఒక వేళ చేస్తే
నేను ఎల్లా ప్రెగడ సుబ్బారావు గారి జీవిత చరిత్ర వ్రాస్తే అందులోని సంఘటనల పై నాకు ఏ హక్కు ఉండదు .నేను దాన్ని చిత్రించిన మాటల పైన .నా క ల్పన ల పైన మాత్రమే నాకు హక్కులుంటాయి అందులోని సమాచారం కొంత గుప్తా గారి పుస్తకంనుంచి నేను సంపాదించి ఉంటె వారి పుస్తకాన్నీ నేను ఆధార గ్రంథం గా ప్రస్తావించి గౌరవిస్తే చాలు .మేధోపరమైనహక్కులకి భంగం రాదు

Written by kavanasarma

March 26, 2017 at 2:50 am

Posted in Uncategorized

%d bloggers like this: