Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

నా ఆలోచనలు 1

నా ఆలోచనలు. 1 సమస్య ( Problem ) ఆలోచించుట (Thinking ) సలహాలు :అడిగినవి అడగనివి ( solicited nsolicited ) నిర్ణయం ( Decision) తెగింపు ( Risk ) అమలు ( Execution ) ఫలితాలు ( Consequences) నేరారోపణ ( Blaming)

మనకి ఒక సమస్య ఎదురైనప్పుడు ఏమి చెయ్యాలని ఆలోచించి నిర్ణయానికి వస్తాం ,నిర్ణయానికి రాలేక పోయినప్పుడు తెలిసినవారు అని మనము అనుకున్నవారిని సంప్రదిస్తాం. వారు మనకి వారికి తోచిన సలహాలు ఇస్తారు. . మనకి సమస్య ఉన్నాడని తెలిసిన మరి కొందరు ఆ పరిస్థితుల్లో ఏంచెయ్యాలో తమకి తెలుసు అనుకున్న వారు మనం అడగకపోయినాసలహాలు ఇస్తారు. ఆ సలహాలు అన్ని విన్నాక మనం తెగించి ఒక నిర్ణయానికి వస్తాం .మనకా తెగింపు లేక పోతే మనకి నమ్మకం ఉన్న వారి చేతిలో నిర్ణయం పెడతాం . నిర్ణాయానంతరం మన దాన్ని అమలు చేస్తాం . లేక మన బదులు మరొకరిని అమలు చెయ్య మని కోరుతాం.
నిర్ణయం అమలయ్యి న కొంతకాలానికి మనకి దాని ఫలితాలు అనుభవం లోకి వస్తాయి.
అవి మనకి నచ్చితే ఏ బాధా లేదు. . నచ్చక బాధకి గురి అయితే నేరం మనదా మరొకరిదా అన్న ప్రశ్న కలుగుతుంది మన అంతట మనమే ఆలోచించి తెగించి నిర్ణయం తీసుకుని ఉంటె అనుమానం లేదు ఆ బాధ్యతమనదే. మనం ఇతర్ల సలహా అనుసరించి నిర్ణయం తీసుకున్నా " నీ సలహా వలన ఆనిర్ణయం తీసు కున్నాను " అనరాదు , మన బదులు నిర్ణయం మరొకరిని మనం తీసుకొనిచ్చిన అనరాదు. . తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకున్నా దానిని ఎవరు అమలు చేసినా , మనం నేరం వారిపై ఆరోపించా రాదు .
ప్రతి వయోధికులు తమ విషయాల్లో తామే బాధ్యులని గుర్తించాలి .. మీరు ఇస్తే తప్ప ఆ నిర్ణయాలు ఇతరులు తీసుకునే పావకాశమే లేదు. మీరు మీ పట్ల మీ బాధ్యతని విస్మరించినప్పుడు మాత్రమే అది సాధ్యం There is always the sanction of the victim ( Ian Rand )

Written by kavanasarma

January 20, 2017 at 2:02 am

Posted in Uncategorized

%d bloggers like this: