Kavana Sarma Kaburlu

All Rights Reserved

తరాల అంతరాలు

leave a comment »

ఇప్పుడు సాధారణం గా మూడు తరాలు కలిసి ఉండటం మన దేశ పట్టణాలలో జరగటం లేదు. పల్లెలలో కొంత ఉంది .నేను ఇక్కడ రెండుతరాలు కలిసి ఉన్నప్పుడు వచ్చే అభిప్రాయాల భేదాలగురించి నా అభిప్రాయంచెప్పాలనుకుంటున్నాను మొదటి తరానికి రెండో తరానికివచ్చే అభిప్రాయభేదాలలో ముఖ్యమైనది రెండో తరపు వివాహాలు. పిల్లో పిల్లాడో తమ కులమో మతమో వేరు అయినా సంబంధానికి మొగ్గు చూపినప్పుడు పెద్దలు అటువంటి వివాహాల వలన కలిగే కాస్త నష్టాలు పిల్లలకి తెలియవు అనుకుంటారు .తప్పు లేదు. అందుకని నచ్చ చెప్ప పోతారు. తప్పు లేదు.
పిల్లలు, పెద్దలకి అనిపించే ఇబ్బందులు పాతకాలానికి చెందినవని ఈ కాలానికి చెందినవి కావని అనుకో వచ్చు. లేదా వాటిని దాటగల శక్తి తమకు ఉన్నదని భావించ వచ్చు. అప్పుడు పెద్దలని ఒప్పించాలని చూస్తారు . పెద్దలు అదంతా పిల్లల భ్రమ అని తలచి చెప్పవచ్చు.తప్పు లేదు.
అసలు గొడవ ఇక్కడ మొదలు అవుతుంది ఎవరిదీ చివరి నిర్ణయం ? పెద్దలు తమదే చివరి నిర్ణయం అవాలి అనుకోవటం తప్పు .ఎందుకంటే ఆ నిర్ణయం యొక్క కాస్త నిష్ఠురాలు భరించాల్సింది పిల్లలే కనక వారికి ఆ నిర్ణయాధికారం ఇవ్వాలి ఆనిర్ణయం విజయ వంతమయ్యేటట్టు సహకరించాలి .
కానీ ఆవిధంగా జరగదు కొన్నిసార్లు . ఎందుకంటే జంతు జాలం లో ఆధిపత్య క్రమం దేహబలం మీద ఆధారపడుతుంది. కానీ మానవుల్లో అది కొంత బుద్ధి బలం మీద కొంత అనుభవ విస్తృతి మీద ,ఆర్ధిక పరిస్థితుల మీద ఆధార[పడి ఉంటోంది. అందువలన పెద్దల మాటకి విలువ నివ్వాలీ అనే అభిప్రాయం పెద్దలందరిలో బలం గా నాటుకు పోయి ఉన్నది అనుభవాల పై ఆధారపడి బుద్ధి తో నిర్మించుకున్న నమూనాలు తమ పరిధికి ఆవల పడే పరిస్థితుల్లో చెల్లక పోవటం చాలా సాధారణం . ఆ కొత్త పరిస్థితుల్లో కలిగే కొత్త అనుభవాల జ్ఞానం తో కొత్త నమూనాలని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆ వెసులు బాటు పిల్లలకి ఉండాలి .
ఇక్కడ తో నేను చెప్పాలి అనుకున్నది అయిపోలేదు. .అల్లాగే పెద్దవాళ్ళకి సంబంధించిన విషయాల్లో చివరి నిర్ణయాధికారం పెద్దలదే అని పిల్లలు కూడా గుర్తించాలి వారికి పరిచయం లేని వాతావరణం లో బతకమని పెద్దలని పిల్లలు నిర్బందించ రాదు. వాళ్ళ ద్వితీయ వివాహాలు వీరి గౌరవ ప్రతిష్ఠలకి సంబంధించిన విషయాలు కావు.

Advertisements

Written by kavanasarma

January 14, 2017 at 2:09 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: