Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

తవ్వాల్సి వచ్చిన కొద్ది విలువ

తవ్వాల్సి వచ్చిన కొద్ది విలువ
కొద్ధి బంగారం కోసం ఎంత తవ్వుతాం ?
ఒక వజ్రం కోసం ఎంత వెతుకుతాం ?
పిడికెడు యురేనియం కోసం ఎంత జల్లెడ పడతాం ?
గుక్కెడు నీళ్ల కోసం ఎంత లోతు తవ్వు తాం ?
వాటి విలువ మనని ఆ శ్రమ పడేటట్టు చేస్తుంది.
యక్ష నిక్షిప్తాల కోసం పాతాళానికి సొరంగం తవ్వుతాం .
బంగారం దాచుకున్న పంది కొక్కుల కోసం కొండలు తవ్వాల్సి వస్తే తవ్వుతాం .
దేశ ధనం లో 25% తక్కువని ఎలా అనుకోను !
నా ఇంట్లో దొంగలు పడి లక్ష రూపాయలు దోచుకుంటే 25000 దొరికితే " ఆబ్బె నాకు ఇది అక్కర్లేదు .మొత్తం దొరికాక మాట్లాడండి " అంటా నా పోలీసులతో.?దొరికింది తీసుకుని " మంచిగ వెతికారు. మరింత మంచిగ వెతికి మొత్తం తెచ్చి ఇవ్వండి" అని భుజం తడతాను . మీరు మాత్రం అల్లా అనరా ?

Written by kavanasarma

January 11, 2017 at 3:42 am

Posted in Uncategorized

%d bloggers like this: