Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

సప్తపది చలన చిత్రం

దృశ్యకావ్యం అయిన చలన చిత్రాన్ని శబ్ద కావ్యం చేయటం పట్ల నాకు ఒక చిన్న చూపు ఉంది .కె .విశ్వనాధ్ సినిమాల్లో ఆ లోపం కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ చూసిన సప్తపది సినిమాలో చివరలో ఈ లోపం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. .. అందుచేత ఈ సినిమా పట్ల నాకు పూర్వం ఏర్పడిన చిన్న చూపు ని పక్కన పెట్టి ఇవాళ ఆ సినిమాని చూసాను . విశ్వనాధ్ ఏమి చెప్పాలనుకున్నాడు?అది ఎలా చెప్పాడు ? అని ఈ సారి జాగ్రత్తగా పరిశీలించాను ఆయన చెప్పిన దాంతో నాకు ఏకీభావం లేదన్న దాన్ని పక్కన పెట్టి చూసాను . చివరిదాకా గొప్పగా చెప్పిన విశ్వనాధ్ , తాను చెప్పదలుచుకున్నది అందరికి అందదేమో అని చివర్లో వాచ్యం చేయటం ఈ సారికూడా నా దృష్టిని తప్పించుకోలేదు.
అయితే నేను కూడా ఎన్నో సార్లు నా కథ ఎక్కువమందికి అందాలన్న దుగ్ధతో వాచ్యం చేస్తూ ఉంటాను అని గమనించాను . ఆఖరికి కారా కూడా తన సంకల్పం కథలో ఆయన చెప్పదలుచుకున్నది నిర్ద్వంద్వం గా వాచ్యం చేయటం గమనించాను .. విమర్శకులకు అందితే చాలు అనుకున్నప్పుడు. జీవాధారలో ఆయన వాచ్యం చేయలేదు. .సంకల్పం లో చేశారు ఎందుకు. ?ఎక్కడో అభద్రతా భావం.
సప్తపదిలోను కొంత శు భలేఖలోనూ విశ్వనాధ్ ఈ అభద్రతా భావానికి లోను అయ్యాడు అనిపిస్తుంది. జలంధర గారూ ! మీరు ఈ పోస్ట్ చూస్తారు అని ఆశిస్తున్నాను . మీ బావగారిని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను

Written by kavanasarma

January 8, 2017 at 1:22 pm

Posted in Uncategorized

%d bloggers like this: