Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

Reference Frame ప్రసక్తి చట్రం

ఒక మనిషి ఎడారిలో ఒంటరిగా వున్నప్పుడు ఆ మనిషి జీవితాన్ని ఎడారితో పోల్చుకుని " జీవితం నిస్సారమైనది" అనుకోవచ్చు .ఇంకొక మనిషి సముద్రం వద్ద ఒక్కడే ఉండి జీవితాన్ని సముద్రం తో పోల్చుకునికి ‘జీవితం గంభీరమైనది.లోతైనది" అనుకోవచ్చు .మూడో వ్యక్తి హిమాలయాల ఎదుట ఒంటరిగా ఉండి ఆ ఉన్నత మైన పర్వతం జీవితాన్ని తలపించగా " జీవితం మహోన్నత మైనది అనుకోవచ్చు" ఈ ముగ్గురు నిలబడి ఉన్న చిత్రాలు వేరు. ఇప్పుడు మొదటి వ్యక్తి ఇలా ఒక ప్రకటన చేసాడు అనుకుందాము
"నేను ఎడారిలో ఉన్నాను
నేను ఏకాంతం అనుభవిస్తున్నాను.
నాకు ఏకాంత పరిస్థిలో జీవితం నిస్సారమైనదన్న భావం కలిగించింది "
అది చదివిన రెండో వ్యక్తి ,మూడో వ్యక్తి మొదటి వ్వాక్యాన్ని పట్టించుకోకుండా " మాకు అలా అనిపించ లేదు " అనటం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది . ఈ ఇద్దరు మొదటి అతని చట్రం తం చిత్రాలు వేరు అని గమనించకపోవటం లోనే ఉంటుంది ఆ తగాదా .
ముగ్గురు ఒకే చట్రం కి చెంది ఉన్నా జీవితం గురించే ఆలోచిస్తున్నా రెండో మనిషి " జీవితం విశాలమైనది" అనుకోవచ్చు. మూడో మనిషి " జీవితం లో ఎత్తు పల్లాలు సాధారణం అనుకోవచ్చు" అనుకోవచ్చు
అందుచేత మనం అవతల వారి ప్రకటనలని వారి చట్రం లో వారి దృక్కోణం నుంచి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి అంతే కానీ మన దాంట్లోంచి కాదు అని నేను అనుకుంటాను. నా ఛత్రం లోంచి
ఐన్స్టెయిన్ యొక్క ప్రత్యేక సాధారణ సాపేక్షసిద్ధాంతాలు కేవలం త్వరణంపొందాని, , పొందే చట్రాల కి సంబంధించినవి. చట్రం మారితే గమనించ గలిగేది మారుతుంది

Written by kavanasarma

December 31, 2016 at 2:59 am

Posted in Uncategorized

%d bloggers like this: