Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ప్రతిదినం ఒక పరిహాసం

బాల మాస పత్రిక లో వఛ్చిన ఒక చమత్కారం చిటుకు థన్ జన్మదినాన్న మిత్రులను " వేడితేనీరు " ఇస్తాను రమ్మని పిలిచాడు .
మిత్రులందరూ బహుమానాలు తీసుకు వెల్లి శుభాకాంక్షలు చెప్పి తెచ్చిన వాటిని ఇచ్చారు.
చిటుకు ఎంత సేపటికి ఇస్తానన్న వేడితేనీరు ఇవ్వలేదు. లటుకు అడిగేశాడు "ఏదిరా తేనీరు ?" అని
" తేనీరు ఏమిటి మధ్యలో ? నన్ను మీరు వేడితే నీరు ఇస్తానన్నాను .ఇంతవరకు మీరు వేడ లేదు నేను ఇవ్వ ;లేదు"అన్నాడు.
"హారినీ. మేము టీ పార్టీ అనుకున్నాము రా !" అని అందరు నోర్లు వెళ్ళ బెట్టారు.
అప్పుడు చిటుకు వాళ్ళ అమ్మ నవ్వుతు పళ్లెం లో లడ్డులూ కారప్పూస టీ తెఛ్చి అందరికి ఇచ్చింది

Written by kavanasarma

December 19, 2016 at 10:55 pm

Posted in Uncategorized

%d bloggers like this: