Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ప్రతిదినం ఒక పరిహాసం

మహిళా మండలి కి మూడు ఇన్సూరెన్స్ కంపెనీలు తమ గొప్పతనం వివరించటానికి తమ ఏజెంట్లని పంపాయి .. వారు వారి వారి కంపెనీలు ఎంత త్వరగా క్లెయిమ్స్ సెటిల్ చేస్తారో గొప్పగా చెప్పుకున్నారు మొదటి అతను ఇలా చెప్పాడు . "మా కంపెనీ 10 వ ఫ్లోర్ లో ఉంది మా పక్క ఇంట్లో ఉండే ఆయన కిటికీలోంచి పడిపోవటం ,మా కిటికీలోంచి చూ సిన మేము వెంటనే ఆయనకీ మేము ఇవ్వాల్సి డబ్బు లెక్క వేసి అతని అంత్య క్రియలయ్యి కొడుకు ఇంటికి వచ్ఛే సరికి చనిపోయిన అయన భార్య కి సంతాపం తెలియ చేస్తూ చెక్కు అందచేశాము "
రెండో అతను ఇలా వివరించాడు " అదే భవనం లో మేము 5 వ ఫ్లోర్ లో ఉన్నాము. " ఆ పడిపోతున్న అతాను మా కంపెనీ లో కూడా త న జీవితం ఇన్సూర్ చేసాడు. మేము అతను మా ఫ్లోర్ దాటుతుంటే చూసి , వెంటనే చె క్కు అతని భార్య పేరు న తయారు చేసి ఆమె మెట్లంబడి పరిగెత్త్తుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ కి వఛ్చిన కాస్సేపటిలో , మేము కిందకి వెళ్లి ఆమె చేతిలో చెక్కు పెట్టి సంతాపం ప్రకటించాము "
మూడో అతను " అతను మా కంపెనీ లో కూడా పాలిసీ తీసుకున్నాడు. . మేము అతను పదో ఫ్లోర్ నుంచి పడటం . మా మొదటి ఫ్లోర్ కిటికీ లోంచి చూసి , చెక్కు వ్రాసి అతను మా ఫ్లోర్ దాటుతున్నపుడు అతని చేతిలోనే దాన్ని పెట్టేసి ఆమె మా ఫ్లోర్ మీదుగా పరిగెడుతున్నప్పుడు ఆమె వెంట పరిగెత్తుతూ సంతాపం తెలియ చేసాం" అన్నాడు.

Written by kavanasarma

December 18, 2016 at 1:03 pm

Posted in Uncategorized

%d bloggers like this: