Kavana Sarma Kaburlu

All Rights Reserved

ప్రతి దినం ఒక పరిహాసం

leave a comment »

ప్రతీ దినం ఒక సింహ కిశోరం వాళ్ళ నాన్న తో అడవి లో షికారు వెళ్ళేది .దార్లో కనిపించిన జంతువులన్నీ రాజు గారికి వంగి దండాలు పెడుతుంటే రాజు తో పాటు యువరాజు కూడా తల ఆడిస్తూ స్వీక రిస్తూ , ఠీవి ఒలక పోసేది . ఒక రోజు దానికి చిన్న అనుమానం వచ్చింది . " ఈ గౌరవాలు అన్నీ నాన్న పక్క నున్నాను జంతువులన్నీ నాకిస్తున్నాయా ? లేక నేను పక్కనున్నానని నాన్నకి ఇస్తున్నారా ? నాకే అయి ఉంటుంది నేను కాబోయే రాజును కదా !.నన్ను మంచి చేసుకోవాలని ప్రజలు ప్రయత్నించారా ?అయినా అనుమానం ఉంచుకోవటం ఎందుకు ?నేను ఒక్కడినే ఇవాళ వెళ్లి తేల్చుకుంటాను " అల్లా అనుకుని కండువా ధరించి జూలు దువ్వుకుని బయలు దేరింది ఒంటరిగా .
మొదట ఎదురైనా ఉడత " సింహపు పిల్లను చూసి " నమస్కారం యువరాజా" అంది . ముందరికివెళ్తే కుందేలు ఎదురై నమస్కారం పెట్టింది కొంచెం దూరం వెళ్ళాక ఒక కోతి ఎదురైంది అదీ నమస్కారం పెట్టింది. సింహ కిశోరం దర్పంగా "ఈ వనానికి రాజెవరు ? "అని అడిగింది
" సింహమే ప్రభూ !" అంది. . కోతి అన్నదాని అర్ధం ఏమిటి అని ఆలోచిస్తూ వెళ్తుంటే ఏనుగు కనిపించింది సింహం పిల్ల " ఈ వనానికి రాజు నేనా మా నాన్నా ? " అని అడిగింది ఏనుగు తిండి ధ్యాసలో జవాబు చెప్పలేదు. కిశోరం రెట్టించింది గట్టిగా .అయినా ఏనుగు జవాబు చెప్ప లేదు " అడుగుతుంటే జవాబు చెప్పవేం ?" అంటూ కళ్ళెర్ర జేస్తూ మీదకి వెళ్ళింది దూకుడుగా . ఏనుగు చేస్తున్న పని ఆపి ఆ సింహపు పిల్లని తొండం తో ఎత్తి దూరంగా విసిరేసి తన పని చేసుకోసాగింది .
సింహం పిల్ల మెల్లిగా లేచి దుమ్ము దులుపుకుని " సమాధానం తెలియక పోతే ఆ మాటే చెప్పా వచ్చు కదా !అంత కోపం ఎందుకు ?" అంది ఏనుగు తో

Advertisements

Written by kavanasarma

December 17, 2016 at 12:04 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: