Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ప్రతిదినం పరిహాసం

గోడకి దేవుడిపటం బిగించమని రంగయ్య కి భార్య చెపింది. ఎత్తు కుర్చీ లో పటం పెట్టి చేతిలో ఎందుకైనా మంచిదని ,నాలుగైదు మేకులు తీసుకున్నాడు. అప్పుడు కూతురు ని పిలిచి "తల్లీ పక్కింటికి వెళ్లి సుత్తి అరువు అడిగి తీసుకురా "అని చెప్పాడు ఆ పిల్ల పక్కింటికి వెళ్లి సుత్తి కావాలని అడిగింది. , వాళ్ళు ,
" మీనాన్న . మేకులు కొయ్యకి కొడతాడా ? గోడకి కొడతాడా ? గోడకి కొడితే అది మట్టి గోడా ? రాతి గోడా ?కనుక్కుని రా " అని వెనక్కి పంపించారు
" ఎంతల్లీ !సుత్తి లేకుండా వచ్చావు? ఇవ్వనన్నారా? " అని రంగయ్య అడిగాడు .
ఆ పిల్ల తల అడ్డం గా ఊపి " వాళ్లు నువ్వు మేకు కొయ్యకి కొడతావా ? గోడకి కొట్టే ట్టయితేఅది మట్టిదా ?రాతిదా ? అని అడి గారు" అని చెప్పింది.
" వెధవ ప్రశ్నలూ వాళ్లునూ !.దేనికి కొడితే ఏమిటిటా ? రాతికి కొడితే సుత్తి ఎమన్నా అరిగి పోతుందా ?ఏమన్నానా? రాతి గోడకే అని చెప్పు తల్లీ " అన్నాడు రంగయ్య
ఆ పిల్ల పక్కింటికి వెళ్లి " రాతి గోడకేట " అని చెప్పింది
" అల్లా అయితే ఇవ్వమమ్మా ! మా సుత్తి అరిగి పోతుంది " అన్నారు వాళ్ళు
ఆ పిల్ల ఆ విషయం ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్న తో చెప్పింది
" పక్కింటి వాళ్లు మరీ ఇంత పిసినారి వాళ్ళు అనుకోలేదు. చస్తామా!అమ్మని నేను పెట్టెలో దాచిన సుత్తి తెఛ్చి ఇచ్చి చావమను తల్లీ " అన్నాడు రంగయ్య

Written by kavanasarma

December 15, 2016 at 11:53 pm

Posted in Uncategorized

%d bloggers like this: