Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ప్రతిదినం ఒక పరిహాసం

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక సాధారణ భార్యా భర్తలు ఉండేవారు. అంటే భార్యా అరవటం భర్త పెడచెవిన పెట్టటం సాధారణం గా జరిగేదన్న మాట భర్తకి గడ్డం పెరిగితే భార్య "గుచ్చుకుంటోంది "అని వెళ్లి "కత్తి పెట్టి గీయించుకు రా కత్తెర వేయించుకు వచ్చేవు జాగ్రత్త "అంది . "అల్లాగే నీ మాటకి ఎదురేమిటి "భర్త
మాట వరసకి అని వెళ్ళాడు.
అతను తిరిగి రాగానే భార్య ‘ అతని చెక్కిళ్ళ మీద ప్రేమగా చేత్తో రాసి " కత్తెర వేయించుకు వచ్చావు కదా ?" అని గోముగా అడిగింది.
" లేదే గీయించుకునే వచ్చాను "అని సౌమ్యం గా ఆంట్ సాధారణ భర్త సాధారణం గా చెప్పగలిగింత సౌమ్యం గా చెప్పాడు
" కాదు కత్తెర వేయించుకు వచ్చావు ఒప్పేసుకో."
" లేదు గీయించుకునే వచ్చాను .కత్తికి పదునులేదేమో . నీ చేతులు మరీ ఇంత కోమలంగా ఇన్నాళ్లు ఎలా ఉన్నాయి ?"
" నా చేతులు నీ సేవల్లో మోటు తేలాయి .వాటికే నీ కేశాంతాల గరుకు తనం తెలుస్తోంది "
" నా మాట నమ్మవా ?"
" నీ మాట నమ్మి చెడనా ?"
మాట మాట పెరిగింది. సాధారణ భర్తకి ఓర్పు సాధారాణంగా ఉండే ఐదు నిముషాలు అయి పోయాయి. ఆమె జుట్టు పట్టుకుని"చెప్తే వినవేమి?"
" మొత్తుకున్నా ఒప్పుకోవేమి " అంది ఆమె.
ఆ భర్త ఆమెని చంపేస్తానని నదిదాకా లాక్కువెళ్ళి " ఏమంటావు/" అని అడిగాడు
" సత్యం భౌగోళికం కాదు. ఇంట్లో ఒకలాగా నది వడ్డున మరోలా ఉండటానికి నమ్ము " అని చెప్పింది
భర్త ఆమెని నదీ ప్రవాహం లోకి తోసేసాడు కోపం తో. అది సాధారణ భర్తలు చేసే పనే కదా !
ఆమె నది లో కొట్టుకు పోతు ఓపికున్నంత సేపు " కత్తెర వేయించుకు వచ్చావు ఒప్పుకో " అంటూ అరవసాగింది . మునిగి పోతు చివరి ప్రయత్నం గా చెయ్యి పైకెత్తి సాధారణ భార్యలకు భర్తలను మార్చుకోవాలని ఉండే బలమైన కోరిక తో చెయ్యి పైకెత్తి కత్తెర లాగ రెండు వేళ్లు కదుపుతూ మునిగి పోయింది.
నీతి : కత్తి వాడితే గడ్డమే పోతుంది. కత్తెర వాడితే భార్యే పోతుంది

Written by kavanasarma

December 15, 2016 at 1:00 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. Violent love story, హింసాత్మకమైన ప్రేమ కథ

    mohan

    December 15, 2016 at 8:54 am


Comments are closed.

%d bloggers like this: