Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

రెండు నాటికలు

నిన్న (10-12-2016) మా సమావేశం లో ఆశ ఖరీదు అణా ( గోవిందు రామ శాస్త్రి ) మరో మహేంజదారో ( ఎం ఆర్ నంది) నాటికల పై చర్చ జరిగింది. ఆ చర్చలో డాక్టార్ దాసరి రాంబాబు, శ్రీ యజ్ఞ నారాయణ శ్రీ వివినమూర్తి శ్రీ దేవభుక్తుని రాజేశ్ , ఆచార్య అనంత సురేశ్ , ఆచార్య కుందుర్తి రజనీకాంత్, ఆచార్య కవన శర్మ లు అభిప్రాయాలని వెలిబుచ్చారు .కవన శర్మ సమన్వయ కర్తగా వ్యవహరించారు ఆశ ఖరీదు అణా శ్రవ్య నాటిక .మరోమహేంజదారో కేవలం ప్రదర్శన లో ఒక కొత్త (ఆ రోజుల్లో) తనం కోసం వ్రాసింది.
ఆ.ఆ ముఖ్య సమస్య అయిన నిరుద్యోగం ఈ నాటి సమస్య కాదు. ఆశ కి నిరాశకి మధ్య ఉన్న సన్నని గీత దాటడానికి ఒక చిన్న ఓదార్పు లేక ఒక కప్పు కాఫీ తొడ్పడతాయని చెప్పటం ఈ నాటిక లోని ఇతివృత్తం చెప్తుంది అది ఈ నాటికి వర్తించే విషయమే . కే. ఈ వస్తువు తో ఈ నాటి వేగవంతమైన పరిస్థితులకి అనుగుణం గా మరో నాటిక వ్రాయ వచ్చు. ‘జీవితం జీవించటానికి కానీ చావటానికి కాదు. సుఖం అనేది వానలో గొడుగు, చలి లో కప్పు కోడానికి దుప్పటి, వేసవి లో స్నానానికి చన్నీళ్ళు ఉండటమే సుఖం అవి ఆస్వాదించే స్థితి లో ఉండాలి అని చెప్పిన నాటిక ఇది
మరో మహేంజదారో ఆరోజుల్లో ప్రదర్శన తో ఎంతోమందిని ఆ కట్టుకున్న నాటిక
వస్తువు విషయంలో ఏ కొత్తదనం లేని నాటిక ఆ విషయం లో ఎంతో విమర్శని ఎదుర్కున్న నాటిక.
మహేంజదారో ఒక ప్రతీక అది ఒక శవాల దిబ్బ. నాశనమైన కాక పతనమవుతున్న నాగరికతకు ప్రతీక గా రచయిత వాడుకున్నాడు,అయితే రచయిత ప్రదర్శన విషయం లో తీసుకున్న శ్రద్ధ రచనలో తీసుకోలేదని అనుకోవాలి.. ఉదాహరణకి పరంధామయ్య పాత్ర అందుచేత ఇది ఒక అద్భుత ప్రదర్శన గా మాత్రమే గుర్తుండి పోతుంది. చదవడంలో నిరాశ పరుస్తుంది. పాత్రలమీద లైట్లు వేస్తూ ఆర్పుతూ ఉండటం , కుర్చీల సంఖ్యతో రంగమేదో చెప్పటం . కేవలం మైమ్ చేస్తూ పాత్రలు కొన్ని సార్లు నటించటం , ప్రయోక్త జోక్యం ఇందులో ఆకట్టుకునే విషయాలు

Written by kavanasarma

December 11, 2016 at 12:20 am

Posted in Uncategorized

%d bloggers like this: