Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

సవారి జడుపు

04-12-2016 ఆంద్ర జ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమైన చింతకింది శ్రీనివాస్ కథ సవారి జరుపు చదివాను. తూర్పు ఆంధ్ర ప్రభువుల ఇళ్లల్లో వారు పాటించే మర్యాదలతో " అమ్మయ్య బావాజీ " పిలుపులతో నాకు పరిచయముంది . కథ చిత్రణ చాలా బావుంది.
పెట్టె పల్లకీలో ముడుచుకుని కూర్చునే తల్లులకు, దారిలో కాలు ముడుచుకునే అవకాశం లేని జాలి స్థితి గురించి అతి సున్నితం గా వ్రాసిన కథ ఇది.
ఇది ఒకప్పటి యదార్ధ స్థితిని తెలియచెప్పేకథ .. నాకున్న రాణివాస స్త్రీల పరిచయం వలన కథలో చిత్రితమైన పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పగలుగుతున్నాను.
అనంతమూర్తి "సంస్కారా "లాగా ఇది ఒక కాలం చెల్లిన ఇతివృత్తం. కన్యాశుల్కం లో లాగ ఇందులో ఈ కాలానికి చెందిన విషయం లేక పోలేదు .అది ప్రయాణం చేసే స్తీలకి ఉద్యోగం చేసే స్త్రీలకి లేకపోతున్న సౌకర్యం .ఆడ బస్ కండక్టర్ సందర్భం లో ఇదే విషయాన్ని రియాలిటీ చెక్ లో రాజి రెడ్డి చెప్పారు

Written by kavanasarma

December 4, 2016 at 2:53 am

Posted in Uncategorized

%d bloggers like this: