Kavana Sarma Kaburlu

All Rights Reserved

నేను – నా సహాధ్యాయి ఉమా రామా రావు ప్రముఖ క ూచిపూడి నాట్య గురువు

leave a comment »

నా భార్య శ్రీమతి ఉమా రామా రావు మరణ వార్తని నా దృష్టికి తెచ్చింది శ్రీమతి ఉమా రామ రావు 1954-56 లలో intrermediate ( సి సెక్షన్) MPC group (Mrs.A.V.N. College Visakghapatnam ) లో నా సహాధ్యాయి . ఆవిడ ( అప్పట్లో అమ్మాయి ) పేరు వడ్డాది ఉమామహేశ్వరి. . ఆమెకో చెల్లెలు ఆ అమ్మాయి పేరు సుమతి. ( ఇప్పుడు ఆమె పేరు సుమతి కౌశల్ ఆమీ కోడలు పేరు భాను ప్రియ ) సుమతి నాకు ఒక సంవత్సరం జూనియర్ .
1955-56 లలో మా కాలేజీ లో కొత్త్తగా డ్రమాటిక్ అసోసియేషన్ అనేది ప్రారంభించి ఎన్నికలు జరిపారు. నేను దాని కార్య దర్శి గా ఎన్నిక అయ్యాను.
మా అసోసియేషన్ ప్రారంభొత్స వానికి నటరాజ రామకృష్ణ గారిని పిలవాటానికి నిర్ణయమైనది . అప్పుడు ఆయన, ఉమకి సుమతి కి కూచిపూడి నృత్యం నేర్పుతూ వారింట్లో నే వుండేవారు. అది మొదటి సారి నేను వారి ఇంటికి వెళ్ళటం.
కొన్ని సంవత్సరాల తరువాత ఉమ నాకు కాకినాడ లో కనిపిస్తే పలకిరించాను అప్పటికి ఆమెకి ,నాకు కూడా వివాహాలు అయ్యాయి. ‘ మన క్లాస్ లో మీ అక్క కనక సుందరి గుర్తు ఉంది గాని మీరు గుర్తు లేరు" అని ఉమ అన్నది
ఈ విషయం " తు హాయ్ మెర్ మోహిని " అంటూ నేను వ్రాసిన ఒక కథలో ప్రస్తావించాను "బుద్ధిమంతులైన మగ పిల్లల ని అదే క్లాసు లోని ఆడపిల్లలు గుర్తు ఉంచుకోరు " అని . ఈ విషయం ఆమె మరో చెల్లెలు సుగుణ ఆమె దృష్టికి తెఛ్చి "నీ గురించి శర్మ మంచి గానే వ్రాసాడు లే " అని చెప్పిందిట . ఈ సుగుణ హిందూ లో అప్పటికే నా మీద ఒక వ్యాసం వ్రాసి ఉంది.
ఈ రెండు సంఘటన ల మధ్య ఈమెని నాకు వాసవి కాలేజీ లో ఒక సహోద్యోగి ( వడ్డాది ఇంటి పేరు). కి సంబంధించిన ఒక పెళ్ళిలో ఒకసారి కలిసాను . ఆమె అప్పటికే గొప్ప నాట్య గురువు. .అప్పుడుఆమె నన్ను తొందర గానే గుర్తు పట్టింది .
ఆమె మంచి మనిషి గొప్ప నాట్య కళాకారిణి ఆమె ఆత్మకి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను

Advertisements

Written by kavanasarma

August 30, 2016 at 2:58 pm

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: