Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

వరలక్ష్మి

వరలక్ష్మి ని మీ ఆవిడ మా ఆవిడా పూజిస్తారు . వ్రతం చేస్తారు ఇల్లంతా బం గారంతో , పిల్లలతో మనవళ్ల తో నింపమని కోరుకుంటారు . మీకు గుర్నాధం అనే కొడుకో తమ్ముడో ఉండి ,మీ పక్కింటి సుబ్బారావు గారికి ముగ్గులు బాగాపెట్టే అలవాటు ,ఇంపయిన ముక్కు కల వరలక్ష్మి అనే ముద్దా బంతి ఉంటె , కేవలం పెద్దలు పొరుగు వారిని ప్రేమించామన్నారని ,బుద్ధిమంతుడైన గుర్నాధం ఆ పిల్లని ప్రేమించటం అనే వ్రతంచేయటం కూడా శ్రావణ మాసం లో ఒక ఆనవాయితీ .దానికి ఫలశృతి "మనసు మనసు కలపడితే జరిగే మనువే "! శ్రావణ మాసం తాళి కట్టు శుభ వేళ. మమ్మలిని భోజనాలకి మీరు పిలవటానికి మంచి ముహుర్తాలున్నాయి 1పార్వతీశాలు లండన్ లేక విశాఖ ప్రయాణం అవటానికి కూడా మంచి సమయం

Written by kavanasarma

August 12, 2016 at 12:26 am

Posted in Uncategorized

%d bloggers like this: