Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

పెద్ద వయస్సు -పెద్ద మనసు

మనం పిల్లలకి మంచి చెడు వివరించుతు పెంచుతాము.వాళ్ళ ప్రవర్తనని మనం ఆశించిన ప్రయోజనం కోసం లేక మనం నివారించ దలుచుకున్న హాని నుంచి రక్షించటం కోసం కట్టడి చేస్తూ ఉంటాము . వాళ్ళు పెరిగిన కొద్దీ స్వయం నిర్ణయాలను అమలుచేసుకునే ప్రయత్నాల్లో జీవనోపాధి మార్గం ఎంచుకోవటం జీవన భాగస్వామిని ఎంచుకోవటం విషయాలు ముఖ్యమైనవి. మనం అడ్డుపడే వాటిలో కూడా ఇవే ప్రముఖమైనవి. వాళ్ళ ఎన్నిక పై మనకు భయాలువుంటాయి. అప్పుడు మనమేమి చెయ్యాలి ?
మనం పెద్ద వాళ్ళం కనక వారి హితం అని మనం అనుకున్నది వారికి మనము తప్పకుండా వివరించి చెప్పాలని నేను అనుకుంటాను .
వాళ్ళు మన సలహా ని స్వీ కరించ వచ్చు .స్వీకరించక పోవచ్చు . వాళ్ళు స్వీకరించకపోతే మనము ఏమి చెయ్యాలి ?
1. కోపం తెచ్చుకోరాదు.
2. వాళ్ళనిర్ణయం సరి అయినది కాదు అని రుజువు చేసే దిశలో అవరోధాలు కలిగించ రాదు.
3. వారి నిర్ణయం సత్ఫలితాలని ఇవ్వటానికి మనము చేగలిగినంత దోహదం చెయ్యాలి.
వారు ఆ ప్రయత్నం లో విఫలులు అయితే వారు కుంగిపోకుండా జరగ నున్న హాని విషయంలో నివారణ లేక నియంత్రణ కి మనకి చేతనైన సహాయం చెయ్యాలి

నా సహద్యోగి ఒకరు అమ్మాయి కులాంతరమే కాక మతాంతర వివాహం చేసికున్నప్పుడు ఆగ్రహావేశం లో ఆ పెళ్లి తనచేతుల మీద చేయకుండా ఆ అమ్మాయిని 15 సంవత్సరాల క్రితం దూరం పెట్టే సాడు కానీ ఆ పిల్ల సరైనా సంపాదన నిలకడ లేని భర్త వలన పిల్లలతో ఇబ్బంది పడుతోందని తెలిసాక . వారికి బాసటగా నిలబడకుండా ఆ తండ్రి హృదయం ఉండ లేక పోయింది. ‘ మన అమ్మాయి నాశనం అయిపోతుంటే చూస్తూ ఉరుకోలేము కదా " అన్నాడు. ప్రథమ కోపం ఉన్నవారు కూడా అటువంటి సమయాల్లో కరిగి పోవాలని అతని నుంచి తెలుసుకున్నాను

Written by kavanasarma

July 16, 2016 at 3:19 am

Posted in Uncategorized

%d bloggers like this: