Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

స్వప్నావస్థ

మనం జాగ్రదావస్థ విషయం లో రెండు మాటలు చెప్పుకున్నాము .ఒకటి మనం జ్ఞానం ఎరుక తెలివిడి అనే పడాలని పర్యాయ పదాలుగా వాడుతూ ఉం టామన్నది మొదటిది . జ్ఞానం ,నుంచి పుట్టిన జ్ఞాన క్రియ ను అంతఃకరణ తో పొందు పరిచినప్పుడు ,జ్ఞాతం అవుతుందిఅన్నది రెండోది . అంటే ఎరుక ని ఈ విధంగా మనం నిర్వచించి నప్పుడు అది జ్ఞాతం అవుతుంది . అది జ్ఞానం కాదు ! జ్ఞానం వెలుగు మాత్రమే వెలుగు చేత తెలుసుకోబడుతున్నది కాదు. ఈ స్పష్టతను గుర్తుఎంచుకుని ముందుకి సాగుదాము .
విశ్వము యొక్క సంపూర్ణ ( విరాట్) స్వరూపం మనకి జాగ్రదావస్థ లో తెలియదు. స్వప్నము నిద్రకి మెల కువకీ సంధి స్థితి. స్వప్నావస్థలో మనకి తెలియ వచ్ఛే విశ్వము కి జాగ్రదావస్థలో తెలియవచ్ఛే విశ్వానికి , ఈ రెంటిని కలిపిన విశ్వానికి ఒక సామాన్యమైన సూక్ష్మ రూపం ఉంది అది సంవేదనలు (feelings) కి సంబంధించినది. అయితే స్వప్నములలో ఇంద్రియములకు అంతఃకరణ కి సంయోగము లేదు. ఇక్కడ సంవేదనలు సంస్కారముల వలన కలుగును . ఈ సంస్కారములు Science of dreams లో Electrical Brain Impulses గా వ్యవహరిస్తారని తరవాత తెలుసుకుంటాము
వేలూరి శివరామ శాస్త్రి గారు ఈ సంస్కారాలు పలు విధానాలని అవి మనస్సు నందు గల సబ్బందు మడతలనుండి ఇవి పుడతాయని చెప్తారు
Christina Marzano and her colleagues at the University of Rome have analysed dreams based on signature patterns of brain waves . They found that though even animals can dream , loss of ability to dream has been found in humans when the Right Inferior Lingual Gyrus Of the Visual Cortex is damaged.(American Scientific)
వేదాంత పరిభాష, సైన్సు పరిభాషా, వేరుగా ఉండటము వలన కొంత సందిగ్ధత ఉన్నా , కొంత చెప్పినదాంట్లో ఉన్న పోలికల వలన నాకు కొంత అర్ధమైనదిని అనుకుంటున్నాను నాకు అర్ధమైన మేర కు వేలూరి వారి మనసు మడతలు . జ్ఞాకపకాల పొరలు ఒకటే అయినా, వారు మనసు అని చెప్పినది మెదడే అయినా , జ్ఞాపకాలు మెదడు కి సంబంధించినవే కనక సంస్కారాలు మెదడు నుండే పుడతాయని చెప్పటానికి అభ్యంతరం కనిపించటం లేదు . క్రియ నుండి ఇంద్రియాలు విరమించుకున్నప్పుడు సంస్కారాలు స్వప్న రూపమున ప్రకాశించును . స్వప్నము ఒక జగత్త్తును సృష్టించును .ఇది మిధ్య కాదు . విరాట్ స్వరూపములో ఒక ముక్క
ఇదే సైన్సు కూడా చెపుతుంది దాని భాషలో.
dreams pull together random thoughts and imageries This is called Activation Synthesis Hypothesis The science also has a Threat Simulation Theory It says dreams are a Biological Defence Mechanism that provide an evolutionary education because of its capacity to repeatedly simulate potential threatening events ,enhancing the Neuro Cognitive Mechanism required for threat protection and avoidance .
ఇది చదివితేమనం తరచు వినే "సింహ స్వప్నం ‘ అనే మాట మనకి ఒక భయానికిచెందిన ఒక మనో చిత్రం గుర్తుకు తెస్తుంది కదా !
మన మెదడు (మనస్సు) సృష్టించే స్వప్న జగత్ మన ఎరుక కి సంబంధించినదే అయితే ఇది ఇంద్రియాలకు సంబంధించినది కాదు .

Written by kavanasarma

June 21, 2016 at 2:59 am

Posted in Uncategorized

%d bloggers like this: