Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

ఆత్మ -నేను – జ్ఞానం మొదటి భాగం జాగ్రదావస్థ

ఉపమిషత్తు ల లో ఆత్మ అని వేలూరి శివరామ శా స్త్రీ గారు వ్యాస వాణి లో వ్రాసినది చదవగా నాకు అర్థమైనది చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను మనుష్యులకు ఒక స్వతస్సి ధ్ధం గా స్ఫురించే అనుభవం ‘నేను ‘ . ఈ అనుభవము జ్ఞానానికి పునాది . ఇది జ్ఞానానికి మధ్య బిందువు . అన్ని రకముల జ్ఞానములు దీని చుట్టూ అల్లుకుని ఉంటాయి .తిరుగుతూ ఉంటాయి .
జ్ఞానం నాలుగు అవస్థలలో కలుగుతుంది .
జాగ్రత్ అవస్థ మొదటిది విశాఖ జిల్లాలో మేలుకుని ఉన్నాను అనటానికి తెలిసే ఉన్నాను అంటారు అంటే జరుగుతున్న విషయాలపట్ల ఎరుక కలిగి ఉండటం అన్న మాట .అంటే తెలివిడి, ఎరుక అనేవి జ్ఞానానికి పర్యాయ పదాలగా వాడుతూ ఉంటాము.
ఈ తెలిసే ఉన్న అవస్థలో ఒకే విషయానికి సంబంధించిన సంవేదనలు ( feelings) ఒకొకరికి ఒకో విధంగా ఉండవచ్చును
విషయము పై జ్ఞానము ప్రసరించి నప్పుడు విషయము ప్రకాశించును ( When light falls on an object , the object reflects light and we see the object) వెలుగు యొక్క స్వభావము చీకటిని పోగొట్టుట . కానీ అది మాత్రమే దాని స్వరూపము కాదు . వెలుగు స్వభావం, దీప్తి ( luminosity ) వెలుగు ఏవిధంగా వస్తువు పై ఆధార పడదో అదే విధముగా జ్ఞానం, విషయము పై ఆధార పడదు
యాజ్ఞ వల్క్యుని ప్రకారము ఙ్ఞానం యొక్క అసలు స్వరూపము స్వయంగా ప్రకాశించుట.
మేలుకుని ఉన్న అవస్థ లో జ్ఞానం , శబ్దం (వినికిడి వలన ) స్పర్శ( ముట్టుకోవటం వలన రూపం ( చూడటం వలన ) రసం ( రుచి వలన ) గంధం ( వాసన వలన ) ల వలన కలిగే ఇంద్రియ జ్ఞానం .జ్ఞానము మనలో స్పందన ( కదలిక) కలిగించ వచ్చుఁను . కలిగించక పోవచ్చును. కలిగించనప్పుడు అతడు గ్రహించడు . అతను కేవలము చూచును సాక్షి మాత్రమే
స్పందన జ్ఞాన క్రియ . జ్ఞానం , జ్ఞానక్రియ ద్వారా అంతఃకరణ తో పొందుపడినప్పుడు "జ్ఞాత " అవుతుంది జ్ఞాతృత్వము జ్ఞాన స్వరూపం లో లేదు . కానీ మెలకువలో జ్ఞానం, జ్ఞాతృత్వ రూపం లోనే భాసం ( takes shape) అవుతుంది ఎందుకంటే ఈ అవస్థలో మొత్తం ప్రక్రియ అంత ఏ క కాలం ( simultaneous గా )లో జరిగి పోతుంది
స్వప్నావస్థ గురించి మరో సారి

Written by kavanasarma

June 20, 2016 at 2:03 am

Posted in Uncategorized

%d bloggers like this: