Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

హిందూ దుర్మార్గులు

మాయాబజార్ సినిమాలో బలరాముడు " భీమసేనుడు పరమ దుర్మార్గుడు " అని వాని వలెనే ఈ గొడవలన్నీ జరుగుతు న్నాయని తీర్పు చెప్తాడు ఈ రోజున అధిక సంఖ్యాకులైన హిందువుల వలెనే అనర్ధాలన్నీ జరుగుతున్నాయని ఒకరకం మేధావులు గొంతెత్తి అరుస్తున్నారు
హిందువులు ఎవరు అంటే జవాబు" న ఇతి " ధోరణి లో వస్తుంది ఇస్లాం , క్రైస్తవ బౌద్ధ పార్సీ మత అవలంబకులు కారు. దళితులు గిరి జను లు ఆటవిక జనులు కుడా కారు ట . ఇంకా మిగిలినది 4 వర్ణాల కి చెందిన వారు అయితే హిందూ దుర్మార్గులు మనుస్మృతి ని పొద్దుఇన్న లేస్తే ప్రతి విషయం లోను పాటిస్తూ పోతూ ఉంటారు . వారు వారి స్త్రీలకి ఏ స్వతంత్రము ఇవ్వక అణగదొక్కే స్తూ ఉంటారు అంటే ఈ హిందూ దుర్మార్గులు చాతుర్వర్ణా లకిచెంది న పురుషులు అనుకోవాలి . అదీ కాదుట . ఇందులో శూ ద్రుల పట్ల బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు విపరీతమైన వివక్ష చూపిస్తూ హింసిస్తూ ఉంటారు ట .వారి పట్ల
వీ రు అనుసరించే విధానాన్ని బ్రాహ్మణత్వం గా , మను స్మృతి అనుసరిత్వం గా గుర్తించాలి త వీరికున్న అధిక సంఖ్యా బలం వలన వీరికి రాజకీయ బలం ,ఉద్యోగబలం , తద్వారా విద్యా సమస్థల పైనా భూమి మీద ఇతర సంపదల మీద భల్లూ కపు పట్టు ఏర్పడి ఇతర్లకి ఊ పిరి ఆడని పరిస్థితి కలిపిస్తు వస్తున్నారు కదా ! . భారతీయ జనతా ప్పక్షం అధికారం లోకి వచ్చాక ఇది మరీ దారుణం ఐ పోయింది ఆంగ్లేయుల పాలనలో కాంగ్రెస్ పాలనల లో కూడా వీ రే అందరిని కాల్చుకు తిన్నారు . ఎవరు ? ఈ అధికసంఖ్యాక ద్విజులు !
ముస్లిముల్ని దువ్వటా నికి హిందువులని నిందించటం ఒక పద్ధతి . హిందువులు అని నిందిం చినప్పుడు అందులో దళితులు శూద్రులు ఉన్నట్టా ? లేనట్టా ? ఉంటేనే కదా హిందువులకి పశు బలం ( Brute force due to majority ) వచ్చేది ! అబ్బే వారు అందులో లేరంటారా ?అప్పుడు ఈ ద్విజ దుర్మారగులు అధిక సంఖ్యాకులు ఎలా అవుతారు ?
ఈ కలపటాలు విడదీ యటాలు కేవలం ఒక వర్గపు మేధా వులు ఒక పథకం ప్రకారం నిబద్ధత తో ఆడే ఆట . తస్మాత్ జాగ్రత్త . అందుకే మనం వారికి దూరంగా ఉండాలి

Written by kavanasarma

June 16, 2016 at 12:22 am

Posted in Uncategorized

%d bloggers like this: