Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

జ్ఞానార్జన -చర్చ

జ్ఞానార్జనకి మార్గాలు 1 పఠనం 2 శ్రుతం 3 అనుభవం 4. మననం 5. వివేచనం
సంపాదించిన జ్ఞానానికి ఒక సిద్ధాంత రూపం ఇచ్చినప్పుడు అది పూర్వ పక్షం అవుతుంది .
ఆ పుర్వపక్షాన్ని సమానులైన వారి పక్కన కూర్చుని వారి ముందు పెడితే అది చర్చకి దారి తీస్తుంది. ఆ మీమాంస లో ఒప్పని వారు ఖండిస్తారు . ఆ ఖండనలు పునర్వివేచనకి దారి తీస్తాయి దీని వలన ఒక ఉత్తర పక్షం రూపు దిద్దుకుంటుంది
సైన్స్ certainty, chance , choice భావాల ఆధారంగా ఏర్పడిన తన పూ ర్వపక్షాలని కొత్త అనుభవాల నుంచి తలెత్తిన చర్చల వలన మార్చుకుంటూ ఉత్తర పక్షాలని ఏర్పరుచుకుంటూ వచ్చింది .
ఇప్పటి జీవన వేగం లో పఠనం చాలామందికి అన్ని విషయాలలోనూ కుదరదు కుదరని వాటి విషయం లో , శ్రద్ధ గా చదివిన వారు అని తాము అనుకున్న వారి ఉపన్యాసాలు విని, అంటే శ్రుతం ద్వారా జ్ఞానాన్ని ఆర్జించటం పరిపాటి అయింది. విన్న దానిని వేగిర పడి నమ్మ రాదు అంటారు .
కొందరు వేగిర పడరు కాని స్వంత అనుభవం తో వివేచించి మననం చేసుకొని నిర్ధారణ కి రాగాలిగినత సమయం ఉన్న వారు కాదు .కానీ వారు , తెలిసిన వారు ఒక పూర్వపక్షాన్ని సమర్ధిస్తూ, ఖండిస్తూ చర్చిస్తుంటే విని తెలుసుకునే పాటి సమయం వెచ్చిం చగలరు .
అక్కడ కుడా కొందరు తమ సందేహాలను అడిగి తీర్చు కుంటుంటే మరి కొందరు బిడి యస్తులు తమ తెలియని తనాన్ని బయటపెట్టుకోలేక ఇతర్ల సందేహాలకి లభించిన సమాధానాలతో సరి పుచ్చుకుంటారు
ఆ విధం గా చర్చ అన్ని రకాల మనస్తత్వాల వారికి లాభం చేకూరుస్తుంది.
సమర్ధులైన వారి నిర్వహణలో చర్చ జ్ఞాన దాయకం
మన మతం ( అభిప్రాయం) తో ఏకీభవించని వారి ని కాక, వారి అభిప్రాయాలని సహేతుకం గా తెగ వేయటం మన చర్చ ద్యేయం ( చర్చ -బెంగలూరు తన రెండవ విడత కార్యక్రమాల తో 3 ఏళ్ళు పూర్తి చేసుకున్న సమయం లో నా అభిప్రాయాలు

Written by kavanasarma

June 11, 2016 at 3:35 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. చాలా చక్కగా భోధించారు సర్. ధన్యవాదాలు
    మధ్యాహ్న వీనుల విందుకు, జిహ్వ చాపల్య పొందుకు,
    మా పాత కారులో గంతులేసుకుంటూ వచ్చేస్తున్నాము.

    mohan

    June 11, 2016 at 3:57 am


Comments are closed.

%d bloggers like this: