Kavana Sarma Kaburlu

All Rights Reserved

మనలోని ఆత్మా పరమ ఆత్మా ఒకటే

leave a comment »

So Siva, Vishnu or at next level Rama and Krishna (incarnations are Puranic and not Vedic gods) and at final level Sai Baba, Gandhi, Ambedkar, NTR, you and me all have degrees of divinity — ఆచార్యా వి.వి.ఎస్. శర్మ
ఆచార్య వల్లూరి శర్మ గారు పేరున్న సాంకేతిక శాస్త్రజ్ఞులేకాక శ్రీ శివానంద మూర్తి గారి కి శిష్యులు సన్నిహితులు ( ఈయన భార్య శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి గురూజీ మేన బావ ) ఆయన అన్నది నా చదువు నేపధ్యం లో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను . నేను 12, 13 తరగతుల్లో రసాయన శాస్త్రం చదువుకున్నాను. అందులో మూలకాలు , సంయోగాలు సమ్మేళనాలు గురించి తెలుసుకున్నాను ఉదాహరణకి ప[పరిశుద్ధమైన నీరు ఒక రసాయన సంయోగం అందులో ఉదజని ఆమ్లజని అనే మూలకాలు నిర్ణీత నిష్పత్తి లో కలిసి ఉంటాయి
నిరు కొన్ని సార్లు మరి కొన్నిటితో కలిసి ఉన్నప్పుడు దాని అసలు రూపు పొడ గట్టదు . చారు లోను మజ్జిగలోను అలా విడిగా తెలియదు
వల్లూరి శర్మ గారు డివినిటీ అన్న దానిని నేను పరమ ఆత్మా గా భావిస్తున్నాను అది కృష్ణుడి లో అతి ఎక్కువగాను రాముడి లో కొద్దిగా తక్కువగాను ఉంది . కారణం రాముడు తన తండ్రి అతని మాట తన పుత్ర ధర్మం లాంటి లోక వాసనలని అంటి పెట్టుకోవటం వలన పరమాత్మ లోని అంశం మే అయినప్పటికీ అతని ఆత్మ దానికి అంటుకుని ఉన్న వాసనల వలన దివ్యత్వాన్ని పూర్తి గా ప్రదర్శించ లేదు
అంటే మనలో ఉన్న దివ్యత్వం ఎంత లోక వాసనలవలన కప్పబడి ఉంటె అంత తక్కువ బయటపడుతుంది
మనం కూడా కొన్నిసమయాలలో మన వాసనలని విదిలించుకో గలుగుతు ఉంటాము ..కాలం లో ఎంత శాతం వాటికి దూరం గా ఉంటె అంత శాతం కాలం మనం అహం బ్రహ్మోస్మి అన్న ఎరుకతో ఉంటాం . ఈ బుద్ది వస్తూ పోతూ ఉంటుంది .యెరుక కలిగిన సమయం మొత్తం సమయం లో ఎంత భాగమో దానిని అంతరాయిక కారణాంకం( intermittency factor) అంటాం . నటులు దివ్యత్వం ఎక్కువగా గల పాత్రలు ధరించినప్పుడు తాత్కాలికం గా అయినా వారు ఇహ వాసనలని విసర్జిస్తూ ఉంటారు . ఆ పాత్ర ధరించటానికి పచేసే ప్రయత్నం లో ఎక్కువ కాలం వెచ్చించటము వలన వారి అంత రాయిక కారణాంకం నాకంటే హెచ్చుగా ఉంటుంది అనుకుంటున్నాను

Advertisements

Written by kavanasarma

April 26, 2016 at 3:12 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: