Kavana Sarma Kaburlu

All Rights Reserved

బంగారు పాప చిత్రం

leave a comment »

ఈ నెల రచన లో డాక్టర్ శివరామ కృష్ణయ్య గురించి నను వ్రాయటం ,ఇవాళ ( 13-04-16 )పొద్దున్న ఈ .టీ.వి. సినిమా గాడి లో ఆ సినిమా రావటం నేను అది చూస్తుంటే నా వ్యాసం గురించి రచన శాయి ఫోనుచేయటం , నిన్న శ్రీపాద వెంకటాచలం ‘ బంగారు పాప లో మీ మావయ్య డైలాగ్ డెలివరీ గురించి నువ్వురాయలేదు " అంటూ డిల్లీ నుంచి ఫొన్ చెయ్యటం , తమాషాగా జరిగాయి నేను నా వ్యాసాల్లో ప్రస్తావిస్తున్న వ్యక్తులతో నాకు ఉన్న పరిచయం గురించే గాని వారి గుణగణాల ,గొప్పతనాల వివరాలు ఇవ్వటానికి ఎ ప్రయత్నం చేయటం లేదు
బంగారు పాపలో ‘ నువ్వు పిల్లనెప్పుడు చూస్తావ్? పిల్లెప్పుడు నచ్చుతుంది? పెళ్ళెప్పుడు చేసుకుంటావ్? ‘ అని మావయ్య అనే విధానం నాకు చాలా ఇష్టం
పోతే బంగారు పాప పథేర్ పాంచాలి తో జాతీయ బహుమానానికి పోటి పడిన గొప్ప సినిమా . అటువంటి సినిమా నుంచి కేసెట్ తయారు చేసే క్రమం లో ముక్కలు అడ్డ దిడ్డం గా కలపబడి అల్లాగే చూపించ బడుతోంది టీ . వి. లో సాన్నాళ్ళు గా . మన వాళ్లకి ఆ సినిమా పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ కేసెట్ ని సరిదిద్దాలి .
గొప్ప సంభాషణలు కల సిని మా లలో పాతవి పెద్ద మనుషులు , బంగారు పాప , మిస్సమ్మ , మయా బజార్ . కొత్తది అతడు !
బంగారు పాప లో కప్పులు బద్దలు కొట్టిన చిన్న పాప పేరు శ్రీమతి పిండిప్రోలు విజయలక్ష్మి . ఆమె శివరామ కృష్ణయ్య గారి మేనల్లుడు కి. శే . ఆచార్యా కందుల సీతారామ శాస్త్రి వియ్యపురాలు

Advertisements

Written by kavanasarma

April 14, 2016 at 6:31 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: