Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

చక్రం తిరిగి మళ్లి మొదటికే

నేను ,విజయ పొద్దుటి నడక కలిసి వస్తుంది అని రోజూ పాల పొట్లాలు వెళ్లి కొని తెచ్చుకుంటూ ఉంటాము . ఇవాళ పాలు అమ్మే అబ్బాయి ని గమనించి విజయ " అతని చెవులకి ఎర్ర రాళ్ళ పొగులున్నాయి .బట్టలు చూస్తే డెనిమ్ పొట్టి లాగు , నైక్ T చొ క్కా! మళ్లీ పోగులు వాడకం లోకి ఫాషన్ పేరిట వస్తున్నాయి కదా" అంది . " కుర్రాడు ఫాషన్ కోసం చెవులు కుట్టించుకున్నాడో లేక పల్లెటూరి గౌడ కుర్రాడు పట్నం వచ్చి బట్టలు ఫాషనబుల్ గా కొనుక్కున్నాడో చెప్పలేను. అలంకరణలు చక్రం లా తిరిగి వస్తూ ,పోతూ ఉంటాయి .వడుగులు చెయ్యటం , ఆలస్యం అవటం మొదలయ్యాక , అప్పుడు చెవులు కుట్టిస్తే నొప్పి పెడుతుందని , చెవులు లేతగా ఉన్నప్పుడే కుట్టించాలని నా మూడో ఏట కుట్టించిన పోగులు, విశాఖ వీధిల్లో హేళనకి గురి అవుతున్నాయని , మా అమ్మ , నాకు వడుగు, అవకుండానే ఏడవ ఏట తీయించేసింది ." అన్నాను
ఉంచుకుని ఉంటె నన్ను నా మనవల వరసైన వాళ్ళు " మా తాత చాలా Mod అందురు కదా "
నేను, డెనిమ్ జీనులు , నైకు టి లు వేసుకుంటాను కదా .పొగులు ఒక్కటే తక్కువ ! అమితబ్కంటే కేవలం మూడో నాలుగో ఏళ్ళు మాత్రమే పెద్దవాడిని

Written by kavanasarma

April 12, 2016 at 2:38 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. ఓడలు బండ్లౌను, బండ్లు ఓడలౌను

    mohan

    April 12, 2016 at 3:40 am


Comments are closed.

%d bloggers like this: