Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

అప్పలమ్మ ,వెంకమ్మ

సింహాచలం లో నెలకొన్న దైవం పేరు అప్పల వరాహ లక్ష్మి నరసింహం . అందుకని అక్కడ పిల్లలకి పెట్టుకునే పేర్లలో ఇవి ఎక్కవగా ఉంటాయి . లక్ష్మి నరసింహం , లక్ష్మీ నరసమ్మ , అప్పల నరసింహం , అప్పల నరసమ్మ , నరసింగ రావు , అప్పలమ్మ ,అప్పల కొండ సింహాచలం (చివరి రెండు ఆడ పిల్లలకి మగ పిల్లలకి కూడా పెడతారు )నా పేరు వరాహ నరసింహ శర్మ
అయితే మధ్య కోస్తా పత్రికల ప్రచురణ యుగం లో వెంకమ్మ , అప్పలమ్మ అనేవి అనాగరిక నామాల కింద ఆ ప్రాంతాలకి చెందిన రచయితలు తమ రచనల్లో అనాలోచితం గా వాడటం మొదలైంది . అది సినిమాల్లోకి పాకింది ఆర్ధికం గా వెనక బడిన ప్రాంతాల నుంచి పొలం పనులకి వచ్చిన వారిలో ఈ పేర్లు ఉన్నవారు ఎక్కువ ఉండటము వలన వాటిపై చిన్న చూపు ఏర్పడి ఉండవచ్చు . కాని ఈ పేర్లు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు , పెట్టుకుంటారు.అందుకని ఆలోచనాపరులు ఆవిధంగా వైఇ పేర్లని వాద రాదు అని మనవి చేస్తున్నాను

Written by kavanasarma

March 30, 2016 at 11:56 pm

Posted in Uncategorized

%d bloggers like this: