Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

ఒకరే వ్యాసుడు అన్న వాదన సమర్ధ నీయమా ?

1 ప్రశ్న ; ఒక మనిషి అన్నోటి చెప్పెసాడా ? మన కాలం లోనే అన్నోటి వ్రాసిన వారిలో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు ఒకరు పుల్లెల శ్రీ రామ చంద్రుడు , కథా రచయితలు వసుంధర మరో ముగ్గురు. అసిమోవ్ కుడా తక్కువ వ్రాయలేదు
ఉప ప్రశ్న ; వ్రాత లేని ఆ రోజుల్లో అన్నోటి స్వంతం గా చెప్పగలిగాడా ?
వ్యాసుడు ఉన్న వాటినే విషయ పరం గా విభజించాడు ఒక చోట చేర్చాడు . స్వంతం గా చేసిన కావ్యరచన మహా భారతం(జయం) చివరి పురాణం భాగవతం
2 ప్రశ్న ఇన్నోటి చెప్పటా నికిఎన్ని ఏళ్ళు బతికాడు ట ?
ఆయన రమా రమి నూరేళ్ళు నిండాక భారతం చెప్పాడు .బైబుల్ లో కూడా మనుషులు రెండు వందల సంవత్సరాలు బతికిన విషయం నమోదై ఉంది
3 ప్రశ్న నూరేళ్ళ వయస్సులో అంత చురుకుగా మనుష్య మాత్రులు ఉంటారా ?
నాకు తెలిసి మోక్షగుండం బెంగుళూరు లో ఉండే వారు . దువ్వురి లలిత విశాఖపట్నం లో ఉన్నారు
4 ప్రశ్న యుగాలు మహా యుగాలు మాటేమిటి ?
యుగం నిడివి 1 సంవత్సరం నుంచి ఆర్య భట్టు చెప్పిన 4320000 సంవత్సరాల వరకు ఎదుగుతూ పోయింది

Written by kavanasarma

February 20, 2016 at 12:27 am

Posted in Uncategorized

%d bloggers like this: