Kavana Sarma Kaburlu

All Rights Reserved

కల్పన -వాస్తవికత

leave a comment »

నిన్న ఆచార్య తంగిరాల రామశర్మ ఫోన్ చేసి "మీ రామ కాండాన్ని ఇంగ్లీష్ లో ప్రచురిస్తే బావుంటుంది . అది మహిమల్ని గణన లోకి తీసుకొని రామాయణం కదా" అన్నారు . అది నా ఆలోచనలని రేపింది .
భారతీయ విశిష్ట కావ్యాల గురించి విమర్శలు వ్రాయటం, ( రామాయణ విష వృక్షం ) ఒక వర్గాన్ని. ప్రాశస్త్యం తెలియచేస్తూ వ్రాయటం ( రామాయణ కల్ప వృక్షం ) ఇంకో వర్గాన్ని, ఆకట్టుకుంటాయి. ఈ రెండు వర్గాలు పరస్పరం మిన్హాయిన్చుకుంటాయి (exclusive , బహిష్కరించుకుంటాయి) అల్లా అని అవి రెండు కలిపితే సమగ్రం ( సంపూర్ణం exhaustive ) కావు. ఈ రెంటికి పూర్తిగా చెందని ఒక మధ్యవర్గం (మూడో వర్గం) ఉంటుంది . వీరు రెండు వర్గాలతో కొంత ఏకీభవిస్తూ , ఇరు వర్గాలతోను ఏకిభవించని స్వంత అభిప్రాయాలు ఎక్కువగా కలిగిన వారుగా ఉంటారు . వీరికి సత్యం పట్ల కోరిక ఉంటుంది వీరిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం మొదటి రెండు వర్గాలు చేసి కుదరక విసిగి వీరిని తాము కాని ఇతర సమూహం ( Complimentary set ) లో జమ కట్టేస్తారు .ఈ రెండువర్గాల వారికి ఐనవి (either ) కానివి ( or ) అనేవే ఉంటాయి . కొంత అవుతూ కొంత కానివి., కొంత కాకపోతూ కొంత అయ్యేవి ఉండవచ్చు అన్న స్పృహ ఉండదు రామాయణాన్ని వడకట్టి అభూత కల్పనలు తీసేసి అసలు కథ ఇదై ఉంటుంది అని వ్రాస్తే, ఇద్దరికీ నచ్చదు
మూడో వర్గం ఉంటుందని ఒప్పుకునే వారిలో కొందరికి , ఆచార్య రెడ్డి శాస్త్రి అన్నట్టు రామ కాండం ( కథ) రసం లేక చప్పగా ఉంటుంది . మరి రసపట్టులో తర్కం ఉండరాదన్ననియమం పెద్దాయన పింగళి ఎప్పుడో పెట్టాడు .
కొద్ది మంది ఓపిక ఉన్న రామ శర్మ గారి లాంటి సత్య (పరి ) శోధకులకి ఉత్సుకత కలిగించ వచ్చు అనే ధైర్యం తో వ్రాస్తూ పోతా ఇకముందు

Advertisements

Written by kavanasarma

February 7, 2016 at 4:17 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: