Kavana Sarma Kaburlu – Sarada Anuvadalu

All Rights Reserved

సైన్స్ ఫిక్షన్ చర్చ సమావేశం 12-12-2015 బెంగళూర ు

కాల్పనిక సాహిత్యం లో ఇప్పటి సైన్స్ టెక్నాలజీ లు భావిష్యత్తులో తీసుకోబోయే రూపాలు వాటి ఫలితాలు ఉహింఛి చేసిన కల్పన తో నడిచే కథలని సైన్స్ కల్పనా సాహిత్యం గా నిర్వచించ వచ్చు అనుకుంటాను. మనకి ఇంగ్లీష్ లో అసిమోవ్ డగ్లస్ ఆడమ్స్ లాంటి ఉద్దండులు ఐన సైంటిస్ట్ రచయితలు ఉన్నారు . తెలుగులో సైన్స్ తెలిసి ఆ చత్రంభావాల ఆధారంగా రచనలు చేసే రచయితలు వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగినంత కొద్ది మంది ఉన్నారు అయితే వీరిలో సైన్స్ ఫిక్షన్ వ్రాయటానికి ప్రయత్నించిన వారు మరీ కొద్ది మంది ఆ విధమైన అతి కొద్ది మంది రచయితలు చేసిన రచనలన్నీ, రమారమి ( భ్రమలు విచ్చల విడి )స్వైర ఆలోచనలతో నిండి ,అద్భుత రసాన్ని చిందించి ఉత్కంఠ తో చదివించే గుణం పెంచుకున్నవే కాని సమంజసమైన ఆలోచనలతో సైన్స్ అవగాహన పెంచేవి గా అనిపించవు
ఇవి నా అభిప్రాయాలు మాత్రమే

క వ న శర్మ

Written by kavanasarma

December 14, 2015 at 3:30 am

Posted in Uncategorized

One Response

Subscribe to comments with RSS.

  1. సైన్సు ఫిక్షన్ – లో ఏమిటి ఉండాలి? పాఠకుని ఆధునిక సైన్సు, టెక్నాలజీ పురోగతిపై అవగాహన పెంచడమా? రాబోయే రోజులలో అది ఏరూపంతీసుకొనబోతూందో ఊహించడమా (technology forecasting)? వైజ్ఞానిక ఆలోచనాసరళిని పరిచయంచేయడమా? నేటి జీవిత గమనాన్ని టెక్నాలజీ పూర్తిగా మార్చివేసింది. సెల్ ఫోన్ లేకపొతే ఇప్పుడు నగరజీవితంలో ఒకవ్యక్తి ఇమడలేడు. ఇంటర్నెట్ లేకపోతే టెలిఫోను, ఎలెక్ట్రిసిటీ బిల్లులు కట్టడం, బాంకు లావాదేవీలు, ప్రయాణపు టిక్కెట్లు కొనుక్కోవడం, టాక్సీ నో, ఆటోనో పిలవడం, అనేక విషయాలు తెలుసుకోవడం చేయలేడు. కంప్యూటర్ మనకు టైప్ రైటర్, లైబ్రరీ, టివి, విడియో ప్లేయరు, స్లైడ్ మేకర్, క్లాక్, కాల్క్యులేటరు, .. మనం కంప్యూటింగ్ మాత్రమే అసలు చేయము. …

    Vvs Sarma

    December 14, 2015 at 12:17 pm


Comments are closed.

%d bloggers like this: