Kavana Sarma Kaburlu

All Rights Reserved

నాకు తెలిసి చలసాని గొప్ప మేధావి కారు గాని చాల గొప్ప మనిషి వృద్ధుల కళ్యాణ రామా రావు గా రు ఎమ్మంటారు సెప్టెంబర్ 20 న

leave a comment »

చలసాని ప్రసాద్ గారు ఒక మంచి , నిజాయితి గల మనిషి ఒక సారి ఆయన నాతో " అందరి మీద మేము విరుచుకు పడతాం . మిరేమిటి మా మీద విరుచుకు పడుతున్నారు?" అని అడిగారు ,ఆయన నా సంతకం కోరి వచ్చిన సందర్భం లో . అనేసి నవ్వేసారు ఆ నవ్వు ఒక పసి పిల్లాడి నవ్వు " మీరు ఫ్లాట్స్ తాళం పెట్టుకోక పోతే మన బి.టి రామనుజనికి, కె.వి ఎస్ వర్మ కి వాళ్ళు ఇచ్చుకొగల రెంట్ కి ఇవ్వకూడదా ?" అని వాళ్ళ తరఫున నన్ను అడిగిన వాడు
" ఇది విరసం ప్రచురణ . మీకు రాయతి లేదు" అని రొండిన చెయ్యి పెట్టి లాక్కోగల మనిషి . హాస్పిటల్ లో విజయ గారిని చూడటానికి వెళ్ళినప్పుడుఆవిడా నాతో , మా ఆవిడతో అన్న మాట"ఈమనిషి రూల్స్ ప్రకారం బండి ఎడమ వైపునే తోల్తాడు . అక్కడ రాళ్ళ కుప్ప ఉంటె దాని మీద నుంచి పోనిచ్చాడు . నాకు ఎముకలు విరిగాయి" అన్నారు
ఆయన రూల్స్ ని మార్క్స్ ఇజం ని శ్రిశ్రిని ఒక్కలా అనుసరిస్తాడు కథా నిలయం లో శ్రీశ్రీ ఫోటో పెద్దది పెట్టేవరకు పట్టువిడవని మనిషి
ఈయన అన్నా అని పిలిచే తుమ్మల వేణుగోపాల రావు గారికి ఈయనకి ఉన్న పోలిక ఇష్టపడిన వారిలో తప్పులు చూడక పోవటం ఇద్దరికీ నేను నచ్చిన వాడినవటం నా అదృష్టం
నేను నమూనాలమిద మాట్లాడినా రామాయణం గురించి మాట్లాడినా వినడానికి వచ్చారు . నా చేత కోడవటిగంటి సైన్స్ రచనలు పినాక పాణి కత్తుల వారధి ఆవిష్కరింప చేసారు
ఆయన వరహాలు చెట్టిగారు పరస్పరం ఆప్యాయం గా త్వం అంటే త్వం అనుకుని మమల్ని నవ్వించి కాఫీకి తీ సుకు వెళ్ళే ముచ్చట మరువలేను
ఆయన చాలా పుస్తకాలు కొనేవారు చదివేవారు కాని ఆయన గొప్ప మేధావి అని నేను అనుకొను. అల్లా నేను అనుకునే వారిలో చామంది కంటే ఈయన చాలా చాలా గొప్ప వ్యక్తి రేపటి విశాఖ యాత్రలో నేను తప్పక ఆయన లేని లోటు గుర్తిస్తాను

Advertisements

Written by kavanasarma

September 3, 2015 at 4:39 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: