Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

హరిలాల్ గాంధీ జీవితం మిద వ్గాచ్చిన పుస్త కం మీద బెంగుళూరు ఐ .ఇ .యస్సి . లో 15-8-2015 న జరిగిన చ ర్చ

69 వ స్వాతంత్ర్య దినోత్సవం నా దు హరి లాల్ గాంధీ జీవితం మిద మేము చర్చించాము అడే రోజున అటెన్బరో గాంధీ సినిమా, , గాంధీ నా తండ్రి అనే మరో సినిమా టీ .వి. లో వచ్చాయి మా చర్చకి ఆధారం గుజరాతిలోగుజరాతిలో చందూలాల్ భాగూ భాయి దలాల్ వ్రాసిన పుస్తకం దీనిని ఇంగ్లీష్ లోకి త్రిదీప్ సుహృద్ అనువదిస్తే ఆ ఆంగ్లానువాదాన్ని చిన వీరభద్రుడు తెలుగులోకి అనువదించాడు అటెన్బరో సినిమా కిఆధారాల్లొ గాంధీ వ్రాసిన " సత్యం తో నా ప్రయోగాలు "అన్న స్వీయ చరిత్ర ఉండగా గాంధి నాతండ్రి సినిమా కిన్ దినకర్ జోషి గుజరాతిలో వ్రాసిన పుస్తకం ఆధారం
చర్చ కేవలం వీరభద్రుడి పుస్తకం మీదే జరగాల్సి ఉండగా ఇది చరిత్రలో ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ గురించిన చర్చ సత్య సమాచారం మీద ఆధారపడాల్సి రావటం లో కొంత పుస్తకం లో లేని సమాచారపు ప్రసక్తి అవసరం కాకా తప్పలేదు
చర్చ ని నిర్వహించిన ఆఅచార్య అనంత సురేష్ గారు హరిలాల్ జీవితం లోని సంఘటనలని థెదీల వారిగా వివరించి రెండు ప్రస్నాలని లేవనెత్తారు అవి ,
1. ఒక వ్యక్తి ఉన్నతమైన లక్ష్యాలని సాధించటానికి సంకల్పించినపుడు ఆ వ్యక్తి తన కుటుంబాన్ని అశ్రద్ధ చేయటం అనివార్యమా?
2. రచయిత తండ్రి కొదుకులలొ ఒకరి పట్ల ఆహేతుకమైన పక్షపాతం చూపించాడా ?
మాములుగా 1గంటా 30 నిముషాల్లో ముగిసే చర్చ ఈ సారి రెండుగంటలు తీసుకుంది
చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలు క్లుప్తం గా ఇవి
దేవభక్తుని రాజేష్ (Software)
గాంధి కి ఉన్నతలక్ష్యాల సాధనలో కుటుంబం పై వెచ్చించ గలిగిన సమయం తక్కువ తనతో ఎకీభవించని వారి కి తన సహాయం నిరాకరిస్తాడు లేక తను ఏకీభవించని వాటికీ సహాయ నిరాకరణ చేస్తాడు అందులో ధర్మాధర్మాలని అంచనా వెయ్యటం కష్టం
రేహమానుద్దిన్ షేక్ (Wikipedia Thelugu)
ఆయనకి సాధారణం గా ఆపేక్షలు , ప్రేమలు తక్కువ!కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై ప్రేమ చూపించాడని అనిపిస్తింది కొన్ని సార్లు కఠినం గా ఉన్నాడని అనిపిస్తుంది
వివినమూర్తి (Writer, Scientist)
గాంధి డడి క్లిష్టమైన వ్యక్తిత్వం మొండివాడు తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి ఆనాటి పరిస్థితిల్లో సమాజానికి సాధారణం గా ఉండే అభిప్రాయాలని పూర్తిగా అనుసరించే వాడు కాని వ్యతిరేకించే వాడు కాని కాడు ఆయన మార్పు కి లోను అవుతున్న వాడే కాని పూర్తిగా మారిన వాడు కాడు తన పట్ల అభిమానం కలవారిని తన మార్గానికి తెచ్చుకోడానికి ఆయన భోజనం మానేస్తు ఉంటాడు అందులో కొంత క్రూరత్వం ప్రదర్శిస్తాడు
ఆయన మొండితనం కుటుంబానికి దేశానికి ఏమి చేసింది అన్న దాని మీద ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి
ఒక వర్గం ఆయన ప్రవర్తన్ కుటుంబం పట్ల సరిగాలేదు అన్న విమర్శ చేసింది నమ్మో రాజకీయ కారణాల వల్లొ అయనని ఇతరతరా విమర్శించే దమ్ములేకో దినకర జోషి పుస్తకం ఆకోవా లోకి వస్తుంది ప్రస్తుతం మనం చర్చ్స్తున్న పుస్తకం ఆ విమర్శకు ప్రతి విమర్శ
ఈ విమర్శలో ఫ్రాయిడ్ సిద్ధాంత ప్రభావం నాకు కనిపిస్తుంది . ఇటువంటి రచనలకు ( ప్రతిష్ట కల వ్యక్తుల జీవితాల కు సంబంధించి) జనాల ఆసక్తి ప్రోద్బలం
ఆ విమర్శ ని ఎదుర్కోవటం ఈ పుస్తక లక్ష్యం కనక రచయిత పక్షపాతం పెద్ద గాంధి వైపే దాన్ని సహేతుకం గా సమర్ధించే ప్రయత్నం ఇందులో ఉంది
మైథిలి ( Gynecologist)
సత్యం నాకు తెలిసింది అని నమ్మే వ్యక్తితో కలిసి జీవించటం చాలా కష్టం అసలు పిల్లల పెంపకమే కష్ట సాధ్యం విశిష్ట వ్యక్తులకి విపరీతమైన హక్కులు ఉండవని వాళ్ళు ఇతర్లు తెలుసు కోవాలి
లైంగికత మొదటి పాపం అనే అభిప్రాయం గాంధీకి ఉంది సత్సంతానానికి సత్కామం అవసరం
క వ న శర్మ శ్రీ శ్రీ రామ్, చదలవాడ మొహన్. విరామ లక్ష్మి దేవపత్ని భూపతి ల వాదన అనంత సురేశ్ తుది మాట తరవాతి విడతలో

Written by kavanasarma

August 17, 2015 at 2:04 am

Posted in Uncategorized

%d bloggers like this: