Kavana Sarma Kaburlu – Sarada Anuvakkulu

All Rights Reserved

గల్పిక

జూలై 26 వ తేదిన విజయవాడ లో పొద్దున్న 10. 30 కి తుమ్మల కళాక్షేత్రం లో యువ రచయితలు స్వీయ గల్పికా పఠ నం చేస్తారని దానికి నేను అద్యక్షుడి గా ఉండాలని మిత్రులు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు కోరారు తల దూర్చాను నేను యువలో కోకు ఒకప్పుడు వ్రాసిన గల్పికలు చదివి వున్నా ఆమాటకి నిర్వచనం " By analysing available data and recognising the pattern " అనే అలవాటు ఐన పద్ధతిలో , సాధించ లేక అంతర్జాలం లో మిత్రులు వేమూరి గారు , మిత్ర అనుజుడు శంఖవరం పాణిని గారు ప్రసిద్ధులు జంపాల గారు చేసిన చర్చ చదివాను ఐనా బ్రహ్మ పదార్ధం బోధపడలేదు
బహుశః ఒక చిన్న కథ ని కొంత వెటకారం కలిపి చెప్తే గల్పిక అవుతుందేమో ! స్కెచ్ లో వర్ణనే ఉంటున్ది అనుకుంటాను
పేరడీ అంటే .. నిర్వచించటం కష్టం అని 300 పుటలో తేల్చి పారేసారు మరో మిత్రులు వెలిదండ వారు
ఇది అంతే గాబోలు
అందు చేత ఈ నెల 26 న తుమ్మల పాలెంలో కవ్వన్న చెప్పిందే వేదం

Written by kavanasarma

July 16, 2015 at 5:40 am

Posted in Uncategorized

%d bloggers like this: