ప్రాప్తకాలజ్ఞుడు ( సమయం వచ్చేసింది అన్న ఎ రుక పొందిన వాడు ) అను రెండో చేప కథ
మొత్తం మూడు చెపలు కధలో . మూడోది మూర్ఖపు చేప దాని విషయం వదిలేద్దాము మొదటిది దీర్ఘదర్శి . ఆ జాతి మనుష్యులు ఛెరువు పది ఆమడల దూరం లో ఉంది అనగానే పంచ పైకి ఎత్తికడతారు అంటే నేను అన్నమాట
కొందరు సమయం ఆసన్నమయ్యాకే సన్నాహాలు మొదలెడతారు అంటే మీరన్న మాట
మీ ఇంట్లో పెళ్ళొ మరోటో ఉంది అని ఆరునెలల ముందు చెప్తారు మీరు నాకు నేను వెంటనే చవక విమానం టికెట్లో, రైల్లో కింది పక్కో కొనుక్కుని సిద్ధ పడిపోతాను పది రోజుల ముందో ఎప్పుడో మీరు ఆహ్వాన పత్రిక పంపిస్తారు అంతా శుభమే
ఏ కారణం వలనో ఆ కార్యక్రమం వాయిదా పడితే , మీరు నాకు నిశ్చయం గా చెప్ప లేదు కదా అన్న ధీమా తో ఉండి పోతారు నాకు ఏ కబురూ తెలియక పోవటం వలన టికెట్టు కాన్సెల్ చేసుకోవాల్సిన సమయం ఆసన్న మైంది అన్న ఎరుక తో మీకు ఫోను చేస్తాను
మీరు ‘ నేను కన్ఫర్మ్ చేయలేదు కదా ." అంటారు
మీరు మాయింటికి ఈ శని ఆదివారాల్లో వస్తానని అన్నా అంతే మీరు ఆదివారం రాత్రి పదింటికి కూడా రాకపోతే నాకే తెలుస్తుంది కదా . మీరు కన్ఫర్మ్ చెయ్యలేదు కదా . నేను దాని కోసం నా పనులు మరోలా సర్డుకుని మీ కోసం ఎదురు చూస్తే ఆ తప్పు మీదా ! లేక పోతే హఠాత్తుగా సోమవారం మీకు వీలై దర్శనం ఇస్తారు .నెను ఆ సమయానికి చెయ్యాలని పెట్టుకున్న పనులు వాయిదా వేసుకుంటాను
అదే మీరైతే ఏంచేస్తారు?
నేను మా ఇంట్లో ఫంక్షన్ కి పిలుస్తే చివరి రోజు వరకు ఆగి వీలై టికెట్టు దొరికితే తప్పకుండా వస్తారు
అవకపోతే మీకు కాలు నొప్పో కడుపు నొప్పో వచ్చాయని ఆ తరవాత నేను ఫోను చేసినప్పుడు చెప్తారు
నేను ఏదో పని మిద మిఉరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను అప్పుడు మీరు మీ పని కోసమో మీ ఇంట్లో ఫంక్షన్ కో ఉండి పొమ్మంటారు చాల ఆపేక్షగా
"నేను రేపు వెళ్లి పోతానని మీకు నెల క్రితమే చెప్పను కదా " అంటాను
"మా ప్రోగ్రాం వారం క్రితమే ఖచ్చితం గా తేలినది "అంటారు మీరు
నా టికెట్టు కాన్సిల్ చేసుకునే వరకు మీరు ఊరుకొరు. నేను అంటే మీకంత అభిమానం
ఏతా వాత నాకు కలిగిన ఎరుక ఏమిటంటే
దీర్ఘదర్శి లకు మానుకోవటాలూ ఎక్కువ . డబ్బు దండగలూ ఎక్కువ
నా ప్లాన్లు మార్చుకోకా తప్పదు
మీకు సన్నాహాలు తక్కువ దండగలు తక్కువ
కాని నాలాగ ఎంతోమంది ఉండరు చాలా మంది మీ లానే ఉన్టారు వారితో డీల్ చేసే సమయాల్లో . సమయం చాలక మీరు ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక నష్ట పోతు ఉంటారు అని ఎంతో దూరం ఆలోచించే నాకు అనిపిస్తుంది